ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో ప్రజలకు సమాచారం అందించే మీడియా ఇప్పుడు ప్రజల కోసం కాకుండా, రాజకీయ పార్టీల కోసం, రాజకీయ నాయకుల కోసం మాత్రమే పని చేస్తున్నాయి. ఒక వ్యక్తి రాజకీయంగా ఎదగాలన్న, రాజకీయాల్ని శాసించాలన్నా ముందు కావాల్సిన పబ్లిసిటీ. రాజకీయాల్లోకి రావాలనుకే వారు ముందు ఓ టీవీ ఛానల్ ని పెట్టుకొవాలని చూస్తున్నారు. ఇక ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న వారు ఎవరికి వారే ఛానల్స్ పెట్టుకున్నారు. మీడియా ఛానల్స్ లేని వారు ఏదో ఒక ఛానల్స్ తో ఒప్పందం కుదుర్చుకొని ఆ రంగు డబ్బాలో తన గురించి డబ్బా కొట్టించుకుంటున్నారు..ఈ ఛానల్స్ కూడా వారి దగ్గర ఎంతో కొంత పుచ్చుకొని వారికే వత్తాసు పలుకుంటారు. ఇక ఎన్నికల సమయంలోనైతే చెప్పాల్సిన అవరం లేదు. మీడియా వారు ఎంత అంటే అంతే.... ఇలా మీడియా కూడా విలువలు మర్చిపోయి నాయకుల జపం చేస్తున్నారు. ఇప్పుడు వారిలో సొంత ఛానల్ లేనిది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. ఇటీవల పరిస్థితులు మారాయి కాబట్టి కాంగ్రెస్ వారు కూడా ఓ ఛానల్ ని పెట్టాలని భావించారు.
పార్టీ మాట అటుంచితే... కాంగ్రెస్ లో ఎదగాలనుకున్న వారు ఇప్పటికే తన బంధువుల చేతనో, లేక వారి తమ్ముళ్ళ చేతనో ఛానల్స్ కొనిచ్చారు. మొన్నటికి మొన్న బొత్స సత్యనారాయణ కూడా అతని తమ్ముడి చేత ‘జీ ’ ఛానల్ కొనిచ్చాడు. ఇక సొంత ఛానల్ లేనిది ఒక్క ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డినే. ఈయన పదవి క్షణాన ఉంటుందో, ఏ క్షణాన ఊడుతుందో ఈయనకే తెలియని పరిస్థితి. ప్రక్క ఛానల్స్ వాళ్ళు ఈయన గురించి యల్లో ప్రచారం చేస్తే.... వాటిని తప్పి కొట్టి ప్రజలకు చూపించాలంటే ఈయకు ఓ ఛానల్ కావాలి. అందుకే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఓ సొంత టీవీ ఛానల్ (రంగు డబ్బా) కొనడానికి సిద్ధం అయ్యాడట. దాంతో తన సోదరుడికి ఈ పనిని అప్ప జెప్పాడట. నలభై , యాభై కోట్లు వెచ్చించి ముఖ్యమంత్రి సోదరుడు ఆ ఛానల్స్ ని కొనేందుకు సిద్ధం అయ్యాడని వార్తలు. సొ... కిరణ్ కూడా తన పదవిని కాపాడుకోవడానికి సొంత రంగు డబ్బా కొనుక్కుంటున్నాడని అనుకుంటున్నారు. మరి ఈ రంగు డబ్బా కిరణ్ జీవితాన్ని రంగుల మయం చేస్తుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more