టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన సుమన్ విచిత్రమైన విమర్శలు చేశారు. సినీ రంగ నుండి అతనికి అవార్డు రాకపోవటం పై ఆవేదనతో కామెంట్ చేశారు. సుమన్ గా తెలుగు సినిమాకు సుపరిచితుడైన సుమన్ తల్వార్ తెలుగు సినీరంగ నటుడు. ఈయన నీచల్ కులం సినిమాతో రంగప్రవేశము చేసి తెలుగు, తమిళ, కన్నడ మరియు ఆంగ్ల భాషలలో 150కి పైగా సినిమాలలో నటించాడు. కరాటే లో నిష్ణాతుడైన సుమన్ తెలుగులో పెద్ద యాక్షన్ హీరో అయ్యాడు. ఈయన అన్నమయ్య సినిమాలో పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్ర, శ్రీరామదాసు చిత్రములో పోషించిన రాముని పాత్ర మరపురానివి. సుమన్ 1959, ఆగష్టు 28న మద్రాసులో జన్మించాడు. ఈయన తల్లి, కేసరీ చందర్ మద్రాసులోని యెతిరాజు మహిళా కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేసినది. తండ్రి సుశీల్ చందర్ మద్రాసులోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో పనిచేసేవాడు. వీరి స్వస్థలము మంగుళూరు. మాతృభాష తుళు. సుమన్ బాల్యములో మద్రాసులోని చర్చ్పార్క్ కాన్వెంటులో కిండర్గార్టెన్ చేరాడు. పాఠశాల విద్య బీసెంట్ థియొసోఫికల్ ఉన్నత పాఠశాలలో జరిగినది. ఆ తరువాత పచ్చయప్ప కళాశాలలో ఆంగ్ల సాహిత్యములో బీ.ఏ పట్టభదృడయ్యాడు. ఈయన తుళు, ఆంగ్లము, తమిళము, తెలుగు,కన్నడ మరియు హిందీ బాషలలో మంచి పట్టు సంపాదించారు. ఈయన కుటుంబ స్నేహితుడు కిట్టూ సుమన్ ఒక తమిళ నిర్మాతకు పరిచయం చేశాడు. ఆ విధంగా 1977లో టి.ఆర్.రామన్న నిర్మించిన తమిళ సినిమా నీచల్ కులంతో సినీరంగంలో ప్రవేశించాడు. తొలి సినిమాలో సుమన్ పోలీసు అధికారి పాత్ర పోషించాడు. నీలిచిత్రాల నిర్మాణం స్కాంలో చిక్కుకొని కొన్నాళ్ళు నానా ఇబ్బందులు పడ్డాడు. కానీ చివరకు దాన్నుండి విజయవంతంగా బయటపడ్డాడు.
అయితే తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన బీసీ ఐక్యవేదిక ఆద్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుమన్ తన మనసులోని మాటను బయట పెట్టారు. అన్నమయ్య చిత్రంలో వేంకటేశ్వర స్వామి పాత్ర లభించడం నా జీవితంలో మరుపురాని సంఘటన అని అన్నారు. అయితే నేను బీసి కులంలో పుట్టినందుకో, ఏమోగానీ నాకు మాత్రం అవార్డు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతో కలిసి రాష్ట్రపతి భవన్ లో అన్నమయ్య చిత్రాన్ని చూడడం నా జీవితంలో ఒక మరుపురాని సంఘటన అని సుమన్ గుర్తు చేసుకున్నారు. సమావేశంలో సుమన్ ఆవేశంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. వెనుకబడిన తరగతుల్లోని అన్ని కులాలవారు ఏకతాటిపైకి రావాలని, సుమన్ పిలుపునిచ్చారు. అయితే త్వరలో అమలాపురం పరిసర ప్రాంతాల్లో మినీస్టూడీయో నిర్మించి ఇక్కడి వారికి ఉపాది కల్పిస్తానని సుమాన్ ఆవేశంగా ప్రకటించారు. సుమాన్ మాటలపై టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నట్లు ఫిలింనగర్ సమాచారం .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more