Teluguwishesh ముకుంద ముకుంద Get Mukunda Movie Review, Mukunda Telugu Movie Review, Mukunda Movie Ratings, Varun Tej Mukunda Movie Review, Pooja Hegde Mukunda Movie Review. Know Mukunda Movie Updates. Product #: 59230 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ముకుంద

  • బ్యానర్  :

    లియో ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    శ్రీకాంత్ అడ్డాల

  • నిర్మాత  :

    మధు, నల్లమలుపు శ్రీనివాస్

  • సంగీతం  :

    మిక్కి జె మేయర్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    .మణికందన్

  • ఎడిటర్  :

    మార్తాండ్ కె. వెంకటేష్

  • నటినటులు  :

    వరుణ్ తేజ్ (హీరో), పూజా హెగ్డే (హీరోయిన్), ప్రకాశ్ రాజ్, రావు రమేష్, బ్రహ్మానందం, శేఖర్ కమ్ముల తదితరులు

Mukunda Movie Review

విడుదల తేది :

2014-12-24

Cinema Story

ముకుంద (వరుణ్ తేజ్) సామాజిక బాద్యత గల వ్యక్తి. స్నేహితులు, ఊరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే మనస్తత్వం కలవాడు. ఇక తండ్రి వ్యాపారాల్లో చేదోడువాదోడుగా ఉంటాడు. స్థానికంగా ఉండే మున్సిపల్ చైర్మన్ (రావు రమేష్) చెడు స్వభావి. అయినా సరే ఎత్తులతో 25 ఏళ్లుగా మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నాడు. ఈయన ఆగడాలు, అక్రమాలు  నచ్చని ముకుంద చైర్మన్ కు వ్యతిరేకంగా పోరాటానికి దిగుతాడు. ఇదే సమయంలో ఓ అమ్మాయితో ముకుంద ప్రేమలో పడతాడు. హీరో చైర్మన్ పై ఎలా పోరాడాడు, అమ్మాయి ప్రేమను ఎలా సాధించుకున్నాడు? అమ్మాయికి, చైర్మన్ కు ఉన్న సంబంధం ఏమిటి తెలియాలంటే థియేటర్ కు వెళ్ళి సినిమా చూడండి.

cinima-reviews
ముకుంద

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ్ తొలి సినిమా ‘ముకుంద’ విడుదల అయింది. మెగాప్రిన్స్ గా ఫ్యాన్స్ క్రేజ్ పొందిన వరుణ్, యూత్ ప్లస్ ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా ఈ సినిమాలోనటించాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్టె చెట్టు’ వంటి ఫ్యామిలీ స్టోరీలను తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను నిర్మించాడు. మిక్కిజే మేయర్ అందించిన సంగీతంకు హిట్ టాక్ వచ్చింది. దీంతో పాటు సినిమా టీజర్లు, పోస్టర్లు కూడా బాగా ఆకట్టుకున్నాయి. విడుదలకు ముందే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో తొలి సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

ప్లస్ పాయింట్స్ :

తొలి సినిమా అయినా.., వరుణ్ తేజ్ బాగా నటించాడు. సినిమాలో క్యారెక్టరైజేషన్ కు చాలా బాగా సూట్ అయ్యాడు. ఫైట్లు, డాన్సు కూడా బాగున్నాయి. అటు హీరోయిన్ పూజా హెగ్డే కూడా తన పాత్రకు న్యాయం చేసింది. మిగతా నటీనటులు కూడా లోపం లేకుండా నటించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు వరుణ్ ఎంత ప్లస్ పాయింటో.., అంతే మైనస్ పాయింట్. సినిమా మొత్తం ఒకే ఎక్స్ ప్రెషన్ తో కన్పిస్తాడు. కొన్నిసార్లు ఆ హావభావాలు చూడలేక బోర్ కొడుతుంది. హీరోను హైలైట్ చేసేందుకు హీరోయిన్ రోల్ ను తగ్గించారు. పాటల్లో మాత్రం బాగా వాడుకున్నారు. దీనికి తోడు సినిమా చూస్తుంటే తర్వాతి సీన్ ఊహించగలగటంతో పాటు ఏదో సినిమాలో చూసినట్లుగా అన్పిస్తుంది. ఫస్ట్ ఆఫ్ పర్వాలేదు అన్పించినా.., సెకండ్ ఆఫ్ మాత్రం అసంతృప్తిని ఇస్తుంది. క్లైమాక్స్ కూడా భారీ స్థాయిలో లేదు.

Cinema Review

శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలి సెంటిమెంట్, రిలేషన్ సినిమాలు బాగా తీస్తాడు అన్పించుకున్నాడు. ‘ముకుంద’ను కూడా బాగా తీశాడు. కానీ కథలో కొత్తదనం లేదు. గత హిట్ సినిమాలతో ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకోగా.., వాటిని నెరవేర్చలేకపోయాడు. కథతో పాటు కథనంలో కూడా అంతగా ఆకట్టుకోలేదు. మిగతా కళాకారుల పనితీరు చూస్తే.., ఈ మూవీకి సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్. కొన్ని సీన్లలో అయితే విజువల్స్ గ్రాండ్ లుక్ తీసుకువచ్చాయి. ఇక సంగీతం కూడా మేజర్ ప్లస్ పాయింట్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు మంచి మార్కులు వేయవచ్చు. ఎడిటింగ్ పరంగా మార్తాండ్ కె. వెంకటేష్ న్యాయం చేశాడు. లియో ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రషన్ అని మర్చిపోయాడు.