Teluguwishesh పటాస్ పటాస్ pataas movie review : nandamuri kalyan ram latest movie pataas telugu review in which shruti sodi playing an actress. Product #: 60184 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    పటాస్

  • బ్యానర్  :

    నందమూరి తారకరామారావు ఆర్ట్స్

  • దర్శకుడు  :

    అనిల్ రావిపూడి

  • నిర్మాత  :

    నందమూరి కళ్యాణ్ రామ్

  • సంగీతం  :

    సాయి కార్తీక్

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    సర్వేష్ మురారి

  • నటినటులు  :

    కళ్యాణ్ రామ్, శృతి సోది, సాయి కుమార్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

Pataas Movie Review

విడుదల తేది :

2015-01-23

Cinema Story

కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) ఒక అవినీతిపరుడైన పోలీస్ అధికారి. ఒక గ్రామీణ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇతను.. తనను తాను కావాలనే హైదరాబాద్’కి బదిలీ చేయించుకుంటాడు. అక్కడ తన అధికారాన్ని ఉపయోగించి తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఇతను హైదరాబాద్ డిజిపి(సాయికుమార్)కి తలనొప్పిన మారిన రాజకీయ నాయకుడు (అశుతోష్ రాణా)ను ప్రోత్సాహిస్తాడు. దీంతో కళ్యాణ్’కి, డిజిపికి మధ్య విభేదాలు వస్తాయి.

అయితే.. కళ్యాణ్ హైదరాబాద్ రావడానికి గల అసలు కారణమేంటో డిజిపి తెలుసుకుని షాక్’కి గురవుతాడు. ఇదే ఈ మూవీలో అసలైన ట్విస్ట్. అయితే.. ఆ కారణం ఏంటి? అసలు కళ్యాణ్ కృష్ణ హైదరాబాద్’కి ఎందుకు ట్రాన్స్’ఫర్ చేయించుకున్నాడు..? ఇతనికి, ఆ రాజకీయ నాయకుడికి ఏమైనా లింకుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే.. వెండితెరపై చిత్రాన్ని వీక్షించాల్సిందే!

cinima-reviews
పటాస్

నందమూరి కల్యాణ్ రామ్ - శృతిసోది జంటగా నటించిన చిత్రం ‘పటాస్’ శుక్రవారం (23-01-2045) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ఈయన స్వీయనిర్మాణంలో తెరెక్కించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుతూ ఇండస్ట్రీ మొత్తం ప్రత్యేకంగా కోరింది. ఈ చిత్రం అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. యాక్షన్ - కామెడీ - ఎంటర్టైనర్’తో రూపొందిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో తెలుసుకుందామా..

Cinema Review

ఎనర్జిటిక్ పోలీస్ ఆఫీసర్’గా కళ్యాణ్ రామ్ అద్భుతంగానే నటించాడు. బహుశా అతని కెరీర్లో ఇదే బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. హీరోయిన్ శృతి సోది స్క్రీన్ పై అందంగా కనిపించడంతోపాటు నటనాప్రతిభను బాగానే ప్రదర్శించింది. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఫస్టాఫ్ మొత్తం కళ్యాణ్ పక్కనే వుంటూ అద్భుతమైన కామెడీని పండించాడు. తన పాత్రను సమర్దవంతంగా పోషించాడు. షైనింగ్ స్టార్’గా ఎమ్మెస్ నారాయణ మరోసారి అలరించారు. అశుతోష్ రాణా, సాయి కుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక దర్శకుడిగా పరిచమవుతున్న అనిల్.. ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించి క్రెడిట్ కొట్టేశాడు. అవసరమైన చోట కామెడీ జోడించి.. ఓవైపు టెంపో, మరోవైపు ఎగ్జైట్ మెంట్ మిస్ కాకుండా చూసుకున్నాడు. రొటీన్ కథ అయినా.. ఇందులో కొన్ని ట్విస్ట్’లు, పంచ్’లు, కామెడీ సీన్లు జోడించి ప్రేక్షకులకు మెచ్చేలా వినోదాత్మక రూపొందించాడు. ఫస్టాఫ్ అంతా సూపర్ కామెడీతో సాగిపోగా.. సెకండాఫ్ మొత్తం వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్’తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ : ఇందులో పెద్ద మైనస్ పాయింట్ కథ! రొటీన్’గా ఓల్డ్’గా వుండటంతో.. తరువాత ఏం జరుగుతుందోనన్నది ప్రేక్షకులు ఊహించుకోవచ్చు. హీరోయిన్ ఈ మూవీలో అంతగా అవసరమనించలేదు. ఆమె కేవలం పాటలవరకు మాత్రమే పరిమితమైంది. పోలీస్ శాఖలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. సినిమా నిడివి కాస్త తగ్గించి వుంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సాయికార్తీక్ అందించిన పాటలు పెద్ద ప్లస్ పాయింట్. వినడానికి ఎంత బాగుంటాయో.. అంతే అందంగా తెరకెక్కించారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని డైలాగులు సన్నివేశాలకు తగ్గట్టు బాగానే సూట్ అయ్యాయి. అనిల్ దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకున్నాడు. కథను నెరేట్ చేసిన తీరు అద్భుతం. స్ర్కీన్’ప్లే క్రిస్పీగా వుంది.

చివరగా : చాలాకాలం తర్వాత కళ్యాణ్ రామ్ కెరీర్లో పెద్ద ‘పటాస్’ పేలింది. (అంటే మూవీ సూపర్బ్’గా వుంది)