ఎలాంటి పనిపాటా లేని కుర్రాడు ఆదిత్య(సాయి ధరమ్ తేజ్) అల్లరిచిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. అమ్మాయిల వెంట పడటం, మందు కొట్టడం మనోడికి చాలా ఇష్టం. ఒక రోజు అంజలి(లారిస్సా బోనేసి)ని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లా ఆ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. అంజలి కూడా ఆదిత్యను లవ్ చేయడం మొదలు పెడుతోంది. ఇలా వీరిద్దరి లవ్ స్టోరీ దూసుకెళుతున్న సమయంలో అనుకోని కారణాల వల్ల అంజలి ఆదిత్యకు బ్రేకప్ చెప్పేస్తుంది.
దీంతో ఆదిత్య మళ్లీ మందు తాగడం మొదలు పెడతాడు. ఒకరోజు రాత్రి ఆదిత్య ఫుల్లుగా తాగేసి చేసిన కొన్ని తప్పుల వల్ల చాలా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంతకీ ఆదిత్య ఆ రాత్రి ఏం చేశాడు.. అంజలి అతడికి బ్రేకప్ ఎందుకు చెప్పింది.. మళ్లీ అంజలి ప్రేమను ఆదిత్య ఎలా దక్కించుకుంటాడు అనేది మిగతా స్టోరీ.
ప్లస్ పాయింట్స్ :
తిక్క అనే విరైటీ టైటిల్‌తో వచ్చిన సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది కేవలం సాయి ధరమ్ తేజ్ మాత్రమే. అస్సలు పస లేని కథను తన మార్క ఎనర్జీతో పాటు కామెడీ టైమింగ్‌ను యాడ్ చేసి సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించాడు. ఇక ఎమోషనల్ సీన్స్‌లో కూడా సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ బాగుంది. కామెడీ పెద్దపీఠ వేయడంతో ఈ సినిమాలో అజయ్ అండ్ గ్యాంగ్ చేసిన కామెడీ ఆడియెన్స్‌ను నవ్వించడంలో సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో సత్య చేసే కామెడీ చాలా బాగుంది. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కథకు మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ‘తిక్క’ టైటిల్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ కథ. కామెడీ జానర్ కథను ఎంచుకున్నప్పటికీ అందులోనుండి కామెడీతో ప్రేక్షకులను అలరించడంలో డైరెక్టర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. కన్ఫ్యూజన్‌తో కామిడీ క్రియేట్ చేయొచ్చు అనుకున్న డైరెక్టర్ ప్లాన్ బెడిసి కొట్టింది. హీరోయిన్స్ కూడా సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు. ముఖ్యంగా మన్నారా చోప్రా క్యారెక్టర్ సినిమాలో ఎందుకు ఉంటుందో ఆడియెన్స్‌కు అర్ధం కాలేదు. ఆలీ-ముమైత్ ఖాన్‌ల ట్రాక్ అస్సలు బాగోలేదు. హీరో-హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ మినహాయిస్తే ఫస్ట్‌హాఫ్‌లో చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇక సెకండాఫ్‌లో కన్ఫ్యూజన్ కామెడీతో లాగించేద్దాం అనుకున్నా అప్పటికీ ఆడియెన్స్‌లో నిరాశ కనిపించేసింది. మొత్తాంగా సినిమా టైటిల్ చూస్తున్న ఆడియెన్స్ కోసం పెట్టినట్లుగా తేలిపోయింది.
నటీనటులు పర్ఫార్మెన్స్ :
తిక్క సినిమాలో సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ గురించి మాత్రమే చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో లాగిన హీరోకు మిగతా నటీనటుల దగ్గరనుండీ ఎలాంటి సహాయం అందకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ‘తిక్క’ బొక్కబోర్లా పడిపోయింది. హీరోయిన్స్ కేవలం స్కిన్‌షో చేయడానికే ఉన్నారా అనే రీతిలో వారిని చూపించారు. నటనా పరంగా వారికి ఎక్కడా ఛాన్స్ లేదు. ఆలీ - ముమైత్ ఖాన్ ట్రాక్ ఆడియెన్స్‌ను మునపటిలా ఆకట్టుకోవడంలో విఫలమైంది.
సాంకేతిక విభాగం:
డైరెక్టర్ సునీల్ రెడ్డి ఎంచుకున్న కథనంతోనే ఫెయిల్ అయ్యాడు. సినిమాలో ఉన్న కాస్త కన్ఫ్యూజన్ కామెడీని సరిగ్గా వినియోగించుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఇక సినిమాటోగ్రఫీతో గుహన్ తిక్క సినిమాకు మంచి సహాయం చేశాడు. ఎక్కువగా రాత్రి టైమ్‌లో నడిచే కథకు కావాల్సిన లైటింగ్‌తో బాగా చూపించాడు గుహన్. థమన్ సంగీతం పర్వాలేదనిపించింది. ‘తిక్క తిక్క’ సాంగ్ క్యాచీగా ఉండటంతో ఆడియెన్స్ ఎంజాయ్ చేశారు. ఎడిటింగ్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.
చివరగా: సినిమా చూసిన వారికి నిజంగానే ‘తిక్క’ ఎక్కుతుంది!