Jawaan Movie Review and Rating | జవాన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Teluguwishesh జవాన్ జవాన్ Sai Dharam Tej Jawaan Movie Review and Rating. Caste Performance and Product #: 85822 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    జవాన్

  • బ్యానర్  :

    అరుణాచల్ క్రియేషన్స్

  • దర్శకుడు  :

    బీవీయస్ రవి

  • నిర్మాత  :

    కృష్ణ, దిల్ రాజు సమర్పణ

  • సంగీతం  :

    థమన్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    కేవి గుహన్

  • ఎడిటర్  :

    ఎస్ ఆర్ శేఖర్

  • నటినటులు  :

    సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ కౌర్, ప్రసన్న, కోట శ్రీనివాసరావు తదితరులు

Jawaan Telugu Movie Review

విడుదల తేది :

2017-12-01

Cinema Story

జై(సాయి ధరమ్ తేజ్) దేశం కోసం ఎంతటికైనా తెగించే మనస్తత్వం కలవాడు. తనకు చిన్నప్పటి నుంచి నాన్న పెంపకంలో నేర్చుకున్న క్రమశిక్షణ, నిజాయితీల వల్ల నిప్పులా బతుకుతుంటాడు. వాళ్ల ఎదురింట్లో ఉండే కేశవ(ప్రసన్న) చిన్నప్పటి నుంచి నెగటివ్ మనస్తత్వం ఉన్న వ్యక్తి. భారత్ లో తయారైన ఆక్టోపస్ అనే క్షిపణి కోసం ఓ అంతర్జాతీయ తీవ్రవాద ముఠా మాఫియా డాన్ గా ఎదిగిన కేశవను ఆశ్రయిస్తుంది. డీల్ ఓకే కాగానే కేశవ క్షిపణిని దొంగిలించేందుకు స్కెచ్ వేస్తాడు. కానీ, ఆ కుట్ర గురించి తెలుసుకున్న జై దానిని అడ్డుకునే యత్నం చేస్తాడు. దీంతో కేశవ, జై కుటుంబాన్ని, జై లవర్ భార్గవి(మెహ్రీన్)ని ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. అలా వ్యతిరేక వ్యక్తిత్వాలు ఉన్న వీరిద్దరి మధ్యపోరాటమే జవాన్ కథ.  

cinima-reviews
జవాన్

కెరీర్ మొదట్లో వరుస సక్సెస్ లు చవిచూసిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఏడాది కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. విన్నర్, నక్షత్రం సినిమాల ఫలితాలతో ఈ ఏడాది హిట్ చవిచూడలేకపోయాడు. దీంతో ఏడాది చివరలో జవాన్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. చాలా గ్యాప్ బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా, నటి స్నేహ భర్త ప్రసన్న విలన్ గా నటించారు. మరి ఈ చిత్ర ఫలితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

విశ్లేషణ...

దర్శకుడు బివిఎస్ రవి ఎంచుకున్న కథ చాలా బలమైందనే చెప్పాలి. ఒక జవానుగా ఎదగాలనుకునే వారికి ఎలాంటి క్రమశిక్షణ అవసరం, ఎంతటి పట్టుదల అవసరమో చూపిస్తూ... దేశం కోసం దేనికైనా రెడీగా వుండే జై అనే కేరక్టర్ ను చాలా బలంగా చూపించాడు. అయితే సాయి ధరమ్ తేజ్ ఇమేజ్ కు మరింత మాస్ కంటెంట్ ను యాడ్ చేస్తే ఫలితం మరోలా ఉండేది. కథ మొత్తం క్లాస్ గా, కాస్త మైండ్ గేమ్ తో సాగిపోతుండటంతో ప్రేక్షకుడికి కనెక్ట్ కావటానికి టైం పడుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు విలన్, హీరోకు మధ్య నడిచే మైండ్ గేమ్ లో... హీరో జై కుటుంబాన్ని చంపే ప్లాన్ లో కేశవ, విలన్ ప్లాన్ నుంచి కుటుంబాన్ని కాపాడుకోవటంలో జై చూపిన తెలివితేటలు బాగా రాసుకున్నారని అనిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన కథ రాసుకున్నప్పుడు.. దాన్ని తగ్గ విధంగా స్క్రీన్ పై ప్రజెంట్ చేయటంలో చాలా సార్లు దర్శకులు విఫలం కావడం చూస్తుంటాం. బివిఎస్ రవి కూడా ఇక్కడ అదే పని చేశాడు. కథకు తగ్గ స్క్రీన్ ప్లే కనిపించలేదు. కొన్ని చోట్ల అప్ డౌన్ కావటం.. సీరియస్ సిచ్యుయేషన్ లో హీరోయిన్ తో రొమాన్స్ పరమ చికాకు పుట్టిస్తాయి. కథపరంగా ఎలాంటి మైనస్ లు లేకపోయినప్పటికీ.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవటమే జవాన్ కు పెద్ద మైనస్.

 

నటీనటుల విషయానికొస్తే... సాయి ధరమ్ మంచి ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పటిదాకా మాస్ రోల్స్ లో రెచ్చిపోయిన మెగా మేనల్లుడు క్లాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ నటన కనబరిచాడు. యాక్షన్ సీన్లు, డాన్సులలో మాత్రం చెలరేగిపోయాడు. నటనపరంగా ఏమోగానీ మెహరీన్ గ్లామర్ ను మాత్రం సరిగ్గానే వాడుకున్నారు. లిప్ కిస్ సీన్ లో... బుగ్గు అంచున సాంగ్ లో ఆమె అందం సినిమాకు ఫ్లస్ పాయింట్ అయ్యింది. అయితే కాస్త బొద్దుగా మారిన మెహ్రీన్ జాగ్రత్త పడితే మంచిది. ఇక విలన్ రోల్ లో ప్రసన్న అద్భుతంగా నటించాడు. మున్ముందు మరిన్ని అవకాశాలు రావొచ్చు.

టెక్నికల్ అంశాల పరంగా.. థమన్ పాటలు షరా మాములే. అయితే బ్యాక్ గ్రౌండ్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. సీనియర్ కెమెరామెన్ కేవి గుహన్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఎస్ ఆర్ శేఖర్ ఎడిటింగ్ ఓకే. డైలాగులు.. ముఖ్యంగా దేశభక్తి నేపథ్యంలో సాగేవి బాగా పేలాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు...

జవాన్ లాంటి థ్రిల్లింగ్ కథ చెప్పాలనుకున్నప్పుడు ట్విస్ట్ ల రివీలింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. కానీ, వాటిని చాలా సింపుల్ గా తేల్చేసిన దర్శకుడు ఆ ప్రభావం మొత్తం కథపై పడేలా చేశాడు. అది కాకుండా వాటిని ఇంట్రెస్టింగ్ గా మలిచి ఉంటే జవాన్ ఫలితం మరోలా ఉండేది.

చివరగా.. జవాన్.. మంచి స్టోరీయే కానీ, నారేషనే తేడా కొట్టింది