Sarkar Movie Review Rating Story Cast and Crew ‘సర్కార్’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘సర్కార్’ ‘సర్కార్’ Get information about Sarkar Telugu Movie Review, Thalapathy Vijay Sarkar Movie Review, Sarkar Movie Review and Rating, Sarkar Review, Sarkar Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 89037 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘సర్కార్’

  • బ్యానర్  :

    స‌న్ పిక్చ‌ర్స్‌

  • దర్శకుడు  :

    ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్‌

  • నిర్మాత  :

    క‌ళానిధి మార‌న్‌

  • సంగీతం  :

    ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    గిరీశ్ గంగాధ‌ర‌న్‌

  • ఎడిటర్  :

    శ్రీక‌ర్ ప్ర‌సాద్‌

  • నటినటులు  :

    విజ‌య్‌, కీర్తిసురేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, యోగిబాబు, రాధార‌వి త‌దిత‌రులు

Sarkar Moive Review

విడుదల తేది :

2018-11-06

Cinema Story

సుందర్‌(విజయ్‌) అమెరికాలో ఒక పేరు మోసిన కంపెనీకి సీఈవో. సంవత్సరానికి రూ.వెయ్యి కోట్ల జీతం. ఓటు వేయడానికి సుందర్‌ ఇండియాకి వస్తాడు. అప్పటికే అతడి ఓటును ఎవరో వేసేస్తారు. తన ఓటు తనకు కావాలని కోర్టుకెక్కుతాడు సుందర్‌. రాజ్యాంగాన్ని, హక్కులను దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానం కూడా అతని ఓటును అతడికి తిరిగి ఇవ్వాలని తీర్పు ఇస్తుంది. ఆ తీర్పును అనుసరించి, దాదాపు మూడులక్షల మంది న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు.

దాంతో ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాల్సిన పుణ్యమూర్తి(రాధా రవి) ప్రమాణ స్వీకారానికి ముందే ఎన్నికలు రద్దవుతాయి. మరో 15రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు చెబుతుంది. ఆ ఎన్నికల్లో సుందర్‌ సీఎం ప్రత్యర్థిగా నిలబడాలని నిర్ణయం తీసుకుంటాడు. మరి ఆ ఎన్నికల్లో సుందర్‌ గెలిచాడా? తన ఓటును తాను దక్కించుకోవడానికి వచ్చిన సుందర్‌ ఓటర్లందరికీ ఏం చెప్పాడు. వాళ్లలో చైతన్యం ఎలా తీసుకొచ్చాడన్నది సినిమా.

cinima-reviews
‘సర్కార్’

విశ్లేషణ

మురుగదాస్‌ కథలన్నీ ఒక సామాజిక నేపథ్యం కలిగి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఉంటాయి. ఈ సినిమాలో కూడా అదే పంథాను అనుసరించాడు. విజయ్‌ అభిమానులకు ఏమేమి కావాలో అవన్నీ సినిమాలో పెట్టాడు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, అర్థమయ్యేలాగా చెప్పేశాడు. ఒక ఓటును ఎవరైనా దొంగతనంగా వేసేస్తే ఆ హక్కును తిరిగి సంపాదించుకోవచ్చనేది చాలా మందికి తెలియదు. రాజ్యాంగ పరిభాషలో ఆ చట్టాలన్నీ సామాన్యులకు అర్థంకావు.

అయితే, సామాన్య ఓటర్లుకు తమ ఓటు హక్కును ఎలా సంపాదించుకోవాలన్న విషయాన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు ఈజీగా చెప్పగలిగాడు దర్శకుడు. అసలు ఇవన్నీ బయట ప్రపంచంలో జరుగుతాయా? లేదా? ఒక బలమైన రాజకీయ ప్రత్యర్థి.. 50 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న సీఎంను ఒక కార్పొరేట్‌ మేధావి ఎదిరించగలడా? ఎదిరించి ఎలా నిలబడ్డాడు అన్న విషయాన్ని ప్రేక్షకులు దృష్టి మరల్చకుండా తన దర్శకత్వ ప్రతిభతో చూపించి మెప్పు పొందగలిగాడు మురగదాస్.

కథ మొదటి సన్నివేశం నుంచి దర్శకుడు కథలోకి వెళ్లిపోయాడు. కాబట్టి, ప్రేక్షకులు సులభంగా సినిమాలో లీనమవుతారు. తన ఓటు కోసం విజయ్‌ చేసే ప్రయత్నాలన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. పాట, ఫైట్‌ అనే కమర్షియల్‌ సూత్రాన్ని ఎక్కడా విస్మరించలేదు. విజయ్‌ సినిమాల్లో ఉండే వాణిజ్య హంగులను ఎక్కడికక్కడ జాగ్రత్తగా పేర్చుకుంటూ వెళ్లాడు. ద్వితీయార్ధం మొత్తం రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది. సుందర్‌ ఏం చేస్తాడా? ఎలా గెలుస్తాడా? అని ఉత్కంఠభరింతంగా చూపించాడు. పాప (వరలక్ష్మి) పాత్ర ఎంట్రీతో కథ మరింత మలుపు తిరుగుతుంది.

బలమైన ప్రత్యర్థి ఉండటంతో కథానాయకుడు ప్రతినాయిక మధ్య సన్నివేశాలు రసవత్తరంగా సాగుతాయి. అయితే మురుగదాస్‌ ఈ సినిమాకు కాస్త లిబర్టీ ఎక్కువ తీసుకున్నాడు. లాజిక్‌కి అందని విషయాలు చాలా ఉంటాయి. కానీ, తన టేకింగ్‌తో అవన్నీ మర్చిపోయేలా ఒక సంక్లిష్టమైన సినిమాను ఒక పక్కా కమర్షియల్‌ సినిమాగా తీర్చిదిద్దాడు. కొన్ని సన్నివేశాలు తమిళనాట రాజకీయాలను ప్రతిబింబిస్తాయి. ఓట్లను అమ్ముకోవడం, ఉచిత పథకాలకు లొంగిపోవడం వంటి అంశాలపై దర్శకుడు సెటైర్లు వేయగలిగాడు. ఆస్పత్రి రాజకీయాలు కూడా తెరపై కనిపిస్తాయి.

నటీనటుల విషానికి వస్తే

విజయ్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. తన అభిమానులను మరోసారి మెస్మరైజ్‌ చేయగలిగాడు. పొలిటికల్‌ డైలాగ్‌లు చెప్పేటప్పుడు విజయ్‌ హావభావాలు ఆకట్టుకుంటాయి. ఓ ఎమ్.ఎల్.ఏ కూతురి పాత్రలో నటించిన హీరోయిన్ కీర్తి సురేష్ కి పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రే. మరో రకంగా చెప్పాలంటే అమెది ఈ సినిమాలో అతిధి పాత్రగానే వుంది. అయితే ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు ఆమె బాగానే నటించింది.

సినిమాలో మరో కీలక పాత్రలో, ప్రతినాయకురాలి పాత్రను పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్ యువ రాజకీయ నాయకురాలిగా తన నటనతో కట్టిపడేస్తోంది. తన రాకతో విజయ్ కు ఒక సమఉజ్జీగా నిలబడిన పాత్ర ఒకటి కనిపిస్తుంది. ఇక ఎప్పటిలాగే రాధా రవి తన నటనతో మరియు తన మార్క్ హావభావాలతో ఆకట్టుకోగా… కమెడియన్ యోగి బాబు తాను ఉన్న రెండు మూడు సీన్స్ లో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా సినిమా చాలా రిచ్ గా వుంది. నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో వున్నాయి. దర్శకుడు మురగదాస్ రాజకీయాలకు సంబంధించి, ఓటుకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ.. ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు కథాకథనాలను మాత్రం ఆయన ఆసక్తికరంగా రాసుకోలేదు, కానీ కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు కొన్ని పొలిటికల్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ డైరెక్షన్ తో కూడా ఆయన ఆకట్టుకున్నారు. ఏ ఆర్ రహమాన్ అందించిన సంగీతం ఆయన స్థాయికి తగ్గట్లు లేదనిపించింది.

అయితే కొన్ని కీలక సన్నివేశాలతో పాటు నేపథ్య సంగీతం అకట్టుకుంది. కానీ పాటలు మాత్రం ప్రేక్షకాదరణ పోందేలా లేవు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఇక ఫైటింగ్ సన్నివేశాల చిత్రీకరణలో కెమెరా పనితనం చక్కగా అకట్టుకుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సినిమాలోని లాజిక్ లేని సన్నివేశాలకు క్లారిటీ ఇచ్చే సీన్స్ ని కూడా ఉంచి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.

తీర్పు..

సామాన్య ప్రజలకు ఓటు హక్కును, దాని విలువను.. కమర్సియల్ ఎలిమెంట్స్ జోడించి అర్థమయ్యేలా చేసిన చిత్రం

చివరగా... ఓటు హక్కు విలువను చాటిన రాజకీయ చిత్రం..

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh