తమిళ స్టార్ హీరో సూర్య , అనుష్క జంటగా నటించిన ‘సింగం ’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పడు అదే సినిమాకు అదే కాంబినేషన్లో సీక్వెల్ గా ‘సింగం-2 ’ రూపొందింది. ఈ చిత్రం తెలుగులో ‘సింగం ’ (యముడు-2) పేరుతో విడుదల అవుతుంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు విడుదల కు సిద్ధం అయింది. ‘యముడు ’ సినిమాలో పవర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సూర్య ఇందులో కూడా అదే పాత్రను పోషించాడు. ఈ సినిమా యముడు లాగే ప్రేక్షకుల్ని అలరిస్తుందో లేదో ఓ సారి ప్రివ్యూ ద్వారా చూద్దాం.
కథ : నరసింహం (సూర్య) బాధ్యతాయుతమైన పోలీసు అధికారి. జనక్షేమం కోసం ఎంతటివాళ్లనైనా ఎదిరిస్తాడు. తన వూరంటే ఎంతో ఇష్టం. సొంతూరిలో పని చేస్తూ కొన్ని పరిస్థితుల వల్ల గోవాకి వెళతాడు. అక్కడ కూడా అక్రమార్కుల భరతంపడతాడు. ఈసారి నరసింహం ఎందుకు విదేశాలకు వెళ్లాల్సొచ్చింది. మరి అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది తెరపైనే చూడాలి.
ఇక ఈ చిత్రం గురించి సూర్య మాట్లాడుతూ...యముడు సినిమా ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో ఈ సినిమా కూడా అంతే అలరిస్తుంది. ఇందులో నేను చేసిన పాత్ర పలువురు పోలీసు అధికారుల జీవితాన్ని పరిశీలించి నటించాడు. ఈ పాత్ర ఖాకీ డ్రెస్సుకు గౌరవం తెచ్చే పాత్ర అవుతుందని చెప్పుకొచ్చాడు. మరి కొద్ది సేపట్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూని అందిస్తాం.
(And get your daily news straight to your inbox)
Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వస్తాయని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more
Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more
Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more
Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more
Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more