క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి గోపీచంద్ తో ఎంతో ‘సాహసం ’ చేసి సినిమా తీశాడు. గత కొన్ని రోజుల నుండి సరైన హిట్ లేక సతమతం అవుతున్న ఈ ఇద్దరు ఎలాగైనా హిట్టు కొట్టాలనే ఉద్దేశ్యంతో భారీ సాహసమే చేశారు. గత కొన్ని రోజుల నుండి వాయిదాలు పడుతున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల మందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రివ్యూ ఓసారి చూద్దాం.
కథ : ఓ సంస్థలో సెక్యురిటీ గార్డ్ గా పనిచేసే గౌతమ్ వర్మ (గోపీచంద్) తన జీతానికి తగినట్లు కాకుండా, రాత్రికి రాత్నే రాత్రే కోటీశ్వరుడు కావాలి, ఖరీదైన జీవితం గడపాలని కలలు కంటుంటాడు. సెక్యూరిటీ గార్డు జాబ్ కి వచ్చిన జీతంతో లాటరీలు కొనడం హాబీ. అనుకోకుండా ఓసారి తన పూర్వీకుల గురించి తెలుస్తుంది. వాళ్లకు సంబంధించిన ఆస్తులు ఓ చోట నిక్షిప్తమై ఉంటాయి. అయితే ఆ చోటుకి చేరుకోవడం తేలికైన విషయం కాదు. అందుకోసం గౌతమ్ ఎన్ని సాహసాలు చేశాడనేదే ఈ చిత్ర కథ. మరోవైపు శ్రీనిధి (తాప్సి)కి దైవభక్తి ఎక్కువ. ఈ ప్రపంచం అంతమైపోతుందని నమ్ముతూ, ఈలోగా జీవితాన్ని ఆనందంగా గడిపేయాలి అనుకొంటుంది. విరుద్ధ భావాలు కలిగిన వీరిద్దరూ ఎలా ప్రయాణం ఎన్ని సాహసాలు చేస్తే సుఖాంతం అవుతుందనేదే కథ. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూని కాసేపట్లో మీకు అందిస్తారం.
(And get your daily news straight to your inbox)
Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వస్తాయని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more
Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more
Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more
Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more
Jul 05 | తమిళ స్టార్ హీరో సూర్య , అనుష్క జంటగా నటించిన ‘సింగం ’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పడు అదే సినిమాకు అదే కాంబినేషన్లో సీక్వెల్ గా ‘సింగం-2 ’... Read more