కత్రినా కైఫ్ తీరని అన్యాయం చేసింది. ఎంతోమంది ఫ్యాన్స్ కు డ్రీమ్ గర్ల్ గా ఉన్న ఈ అమ్మడు ఇక రన్బీర్ కపూర్ కు సోల్ మేట్ గా మారనుంది. ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న ఈ జంట ఈ మద్యే సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుందని బాలీవుడ్ లో పుకార్లు వస్తున్నాయి. కత్రినా లండన్ కు వెళ్ళినపుడే చాలా సీక్రెట్ గా ఈ వ్యవహారం జరిగిందని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఎంత పని చేశావు కత్రినా.., మా కలలకు తీరని అన్యాయం చేశావు అని నిరాశ చెందుతున్నారు.
కుటుంబ సభ్యులతో క్రిస్టమస్ జరుపుకునేందుకు కత్రినా లండన్ వెళ్కగా కాస్త ఆలస్యంగా రన్బీర్ కూడా అత్తవారింటికి వెళ్ళాడు. కత్రినా ఇంట్లో పండగ జరగటంతో పాటు ఇద్దరి ప్రేమాయణంప ప్రస్తావన వచ్చిందట. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఇద్దరూ చెప్పటంతో పెద్దలు కూడా ఒప్పేసుకుని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిశ్చితార్ధం చేశారట. ఎంగేజ్ మెట్ రింగ్ మార్చుకుని లండన్ నుంచి కొత్త జంట తిరిగి వచ్చిందని అంతా కామెంట్ చేస్తున్నారు. దీనిపై ప్రేమికులిద్దరూ స్పందించకపోవంతో ఇదే నిజమని ప్రచారం జరుగుతోంది.
ఇక పెళ్ళి విషయానికి వస్తే..., ఈ ఏడాది మే నెలలో ఇద్దరికి పెళ్లి చేయాలని ఫ్యామిలీ డిసైడ్ అయిందట. అంటే మరో నాలుగు నెలల్లో ఈ జంట కొత్త జీవితం ప్రారంభించనుంది. కానీ సన్నిహితులు మాత్రం మేలో పెళ్లి డౌటే అంటున్నారు. ప్రస్తుతం ఇద్దరికీ బిజీ షెడ్యూల్స్ ఉండటంతో పెళ్ళి గురించి ఆలోచించే సమయం లేదని చెప్తున్నారు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి తీరిగ్గా పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటున్నారు. పెళ్లి ఎప్పుడయితేనేం.., సగం పెళ్లి చేసుకున్న పొడుగు కాళ్ళ సుందరిపై ఫ్యాన్స్ ఇప్పటికే సగం ఆశలు వదులుకున్నారు. మిగతా తంతు కూడా పూర్తయితే ఎంతమంది అభిమానులు అనాధలు అవుతారో.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more