మూడుపదుల వయస్సు దాటినప్పటికీ తన నటనతోబాటు తన అందచందాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మల్లూ బ్యూటీ నయనతార.. త్వరలోనే సన్యాసం పుచ్చుకోవాలనే ఆలోచనలో వుందని కోలీవుడ్’లో ప్రచారం కొనసాగుతోంది. ఇదేదో సినిమాలో నటించి పాత్ర అనుకునేరు.. అస్సలు కానే కాదు. తను నిజంగానే సన్యాసిగా మారాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
నిజానికి నయన సీని కెరీర్ ఎంతో ఉజ్వలంగా కొనసాగుతోంది. ఆమె మొదటి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్సే ఎంతో సవ్యంగా నడుస్తోంది. దిగ్గజ హీరోలతోపాటు జూనియర్లతోనూ నటిస్తున్న ఈ అమ్మడు.. తన హాట్ అందాలను ఆరబోస్తూ వరుసగా విజయాలను పొందుతోంది. ‘రాజారాణి’, ‘ఆరంభం’, ‘ఇదు కదిర్‌వేల్ కాదల్’ లాంటి చిత్రాల విజయాలు నయనతారకు సెకండ్ ఇన్నింగ్‌లో చాలా హెల్ప్ అయ్యాయి. అంతేకాదు.. ప్రస్తుతం సూర్యతో ‘మాస్’, ఉదయనిధితో ‘నన్భేండా’, జయంరవికి జంటగా ‘తనీ ఒరువన్’ చిత్రాలతో పాటు లేడి ఓరియంటెడ్ చిత్రం ‘మాయ’ చేస్తూ ఫుల్ బిజీగా వుంది. అయినప్పటికీ.. ఈమె సన్యాసం స్వీకరించి ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటోందట!
ఎందుకంటే.. వ్యక్తిగత జీవితంలో ఈ సెక్సీ బ్యూటీ రెండుమూడుసార్లు ప్రేమలో ఓడిపోయింది. నటుడు శింబు, డ్యాన్సర్-డైరెక్టర్ ప్రభుదేవాలతో ప్రేమలో మునిగి తేలిన ఈ అమ్మడు.. వారితో విడిపోయింది. మొదట్లో శింబుని ప్రేమించిన ఈ అమ్మడు.. తన బెడ్’రూమ్ సీక్రెట్లతో సహా అంతా ఓపెన్’గా రివీల్ చేసేసింది. కానీ ఏమైందో తెలీదు కానీ.. వాళ్లిద్దరూ విడిపోయారు. ఇక కొన్నాళ్ల తర్వాత ప్రభుదేవా ప్రేమలో పడిపోయిన అమ్మడు.. పెళ్లిదాకా వాళ్ల వ్యవహారం నడిచింది. అంతా సవ్యంగానే సాగుతోందని అనుకుంటే.. వీళ్లుకూడా సడెన్’గా విడిపోయారు. ఇంతేకాదు.. మరికొంతమందితోనూ ఈ అమ్మడు ప్రేమవ్యవహారాలు నడిపినట్లుగా వార్తలు వచ్చాయి. వాటిలో వాస్తవం ఎంతుందో తెలీదుగానీ.. రెండుసార్లు ప్రేమలో ఓడిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన నయన.. ప్రేమ, పెళ్లి మీద విరక్తి చెంది సన్యాసం స్వీకరించాలని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.
ఇదిలావుండగా.. ఏడాదిక్రితమే ఈ భామ హిమాలయాలకు వెళ్లి అక్కడ సన్యాసులతో మాట్లాడి మనశ్శాంతి కూడా పొందినట్లు సమాచారం. పైగా.. ఆమె అందివస్తున్న అవకాశాలను కాదనుకుని.. ప్రస్తుతం చేస్తున్న మూవీలపైనే దృష్టి సారించి వాటిని కంప్లీట్ చేసే పనిలో పడిందట! వరుసగా ఆఫర్లు వస్తున్న తిరస్కరిస్తోందని టాక్! ఇలా నయన ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే.. త్వరలోనే ఆమె సన్యానం పుచ్చుకునే అవకాశాలు చాలావరకు వున్నాయంటూ గుసగుసలాడుకుంటున్నారు. మరి.. దీనిపై నయన స్పందన ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more