‘‘ఓ సాదాసీదా అమ్మాయిగా, పరిణతి ఉన్న అమ్మాయిగా కనిపిస్తున్నా ఈ చిత్రంలో. నా రెండో సినిమాకే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించడం నా అదృష్టం ’’ అంటోంది విశాఖ అమ్మాయి నందిత. ఈ భామ నటించిన తాజా చిత్రం ‘ ప్రేమకథా చిత్రమ్ ’. సుధీర్‌బాబు కథానాయకుడు. ఆర్.పి.ఏ క్రియేషన్స్-మారుతి టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. సుదర్శనరెడ్డి నిర్మాత. ఈరోజుల్లో, బస్‌స్టాప్ సక్సెస్‌ల తర్వాత మారుతి స్వీయ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కించారు. ‘ఈరోజుల్లో’ ఛాయాగ్రాహకుడు జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సినిమా విడుదల అయి మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా ఆమె మనతో పంచుకున్న విషయాలు.
టాలీవుడ్ సినిమాలో తెలుగు హీరోయిన్స్ శకం జయ ప్రద, జయసుధ ఆ తరువాత విజయశాంతిల తో ముగిసిపొయింది. ఇప్పుడు తెలుగు సినిమాలలో అంతా బొంబాయి బ్యూటీలదే హవా. ఒక్కొక్క హీరోయిన్‌కి కోట్ల మీద గుమ్మరిస్తున్నారు మన తెలుగు నిర్మాతలు. ఈ పరిస్థితులలో బాలీవుడ్ బ్యూటీలకు పోటీ ఇవ్వగల సత్తా ఉన్న హీరోయిన్ తెలుగు సినిమాకు దొరికిందని ఒక ప్రచారం జరుగుతుంది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ నందిత. తేజ తీసిన నీకు నాకు డాష్..డాష్.. సినిమా ద్వారా ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది.అందం,అభినయం తో పాటు నేటి యూత్ ను ఆకర్షించే క్రేజీ లుక్స్ కూడా నందితకు ఉన్నాయి అని అంటున్నారు. కలర్ స్వాతి, బిందు మాధవి లాంటి తెలుగు హీరోయిన్స్ సాధింప లేని క్రేజ్‌ను నందిత సాధిస్తుందని చెపుతున్నాయి సినీవర్గాలు.
తేజ దర్శకత్వంలో ‘నీకు నాకు డాష్ డాష్’ చిత్రంతో తెరకి పరిచయమయ్యాను. ఆయన దర్శకత్వంలో చాలా నేర్చుకున్నా. అతడితో పని ఓ డిఫరెంట్ అనుభవం. అలాగే ఆ చిత్రంలో నా నటనకు మంచి గుర్తింపొచ్చింది. దాంతో మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి.
రెండో ప్రయత్నంగా ‘ప్రేమకథా చిత్రమ్’లో నటించా. ఇదో క్యూట్ రొమాంటిక్ లవ్‌స్టోరీ. అలాగని రొటీన్‌గా ఉండదు. మారుతి లవ్‌ని వైవిధ్యమైన షేడ్‌లో చూపించారు. పతాకసన్నివేశం హైలైట్. నేనీ చిత్రంలో మూడు వేరియేషన్లలో
కనిపిస్తాను. మొదట సాధారణ అమ్మాయిగా, తర్వాత మెచ్యూర్డ్ గాళ్‌గా, తదుపరి మానసిక పరిపక్వత కలిగిన అమ్మాయిగా కనిపిస్తాను. మూడు చోట్లా సమానంగానే ప్రదర్శన ఉంటుంది. లవ్, కామెడీ, యాక్షన్ ఉన్న చిత్రమిది. హీరో సుదీర్ చాలా హార్డ్‌వర్కర్. తనతో వర్క్ చాలా బావుంది. నాకెరీర్ ఆరంభమే బావుంది.
ప్రస్తుతం మలయాళంలో ‘లండన్ బ్రిడ్జ్’ చిత్రంలో నటిస్తున్నా. అనీల్.సి.మీనన్ దర్శకుడు. పృధ్వీరాజ్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
నేను సినిమాల్లోకి రావడానికి కారణం అమ్మ. తనే ఆడిషన్స్‌కి ఫోటోలు పంపింది. అలా వచ్చిన అవకాశమే తేజగారి ‘నీకు నాకు డాష్ డాష్’.
అమ్మ ఆసక్తి ఒక్కటే కాదు నటన అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకున్నానని నందిత తెలిపింది. మరిన్ని మంచి అవకాశాలతో దూసుకుపోవాలని ఆశిద్దాం.
(And get your daily news straight to your inbox)
Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more
Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు... టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more
Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more
Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more
Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more