చక్రాల్లాంటి కళ్లను గిరగిరా తిప్పుతూ, చూపులతోనే అన్ని భావాలనూ పలికించేయగలరామె. నోరు తెరచి మాట్లాకుండా, ముఖ కవళికలతోనే అన్ని విషయాలనూ చెప్పేయగలరామె. పాజిటివ్ పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులను కదిలించడమే కాదు, నెగిటివ్ పాత్రలతో భయపెట్టడమూ తెలిసిన అరుదైన నటి ప్రీతినిగమ్. పలు సీరియళ్లు, సినిమాల్లో నటించి మెప్పించిన ప్రీతి మనసులోని మాటలు...
‘చంద్రముఖి ’లో బాగా భయపెడుతున్నారు?
చేస్తున్నప్పుడు నాకే భయమేస్తోంది. నెగిటివ్ రోల్ చేయడం చాలా కష్టం. కండరాలు బిగించి, కళ్లు బాగా విప్పార్చి చేయాలి. అదంత ఈజీ కాదు.
నెగిటివ్ రోల్ చేయడం ఇదే మొదటిసారా?
లేదు లేదు. డీడీ 2 లో ఒకసారి చేశాను. ‘కస్తూరి ’లో కూడా విలన్‌నే. ‘సునీల’ అనే ఆ పాత్ర పేరుతో ఇప్పటికీ నన్ను పిలుస్తుంటారు.
అసలు నటి ఎలా అయ్యారు?
నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. ఓసారి ఓ డ్యాన్స్ బేస్డ్ డాక్యుమెంటరీకి డ్యాన్సర్ కావాలంటూ మా మాస్టర్ అనిల్ కుమార్‌ను సంప్రదించారు. ఆయన నన్ను పంపించారు. ఆ తర్వాత ఒక టెలిఫిల్మ్‌కి కొరియోగ్రఫీ చేయడానికి పిలిచారు. అప్పుడా దర్శకుడు ‘నువ్వు ఎందుకు నటించకూడదు ’ అన్నారు. నేను అంతగా ఆసక్తి చూపించకపోయినా నన్ను ప్రోత్సహించి, నాకోసం ఓ పాత్రను కూడా సృష్టించారు. అలా మొదలైన నటన ఈరోజు వరకూ సాగుతూనే ఉంది.
ఆడపిల్లల్ని నటిని చేయడానికి ఇంట్లోవాళ్లు వెనుకాడతారు. మరి మీ పేరెంట్స్ ఏమన్నారు?
అమ్మానాన్నలిద్దరూ టీచర్లే కావడంతో ఇంట్లో డిసిప్లిన్ ఎక్కువ. మేం నలుగురు అక్కాచెల్లెళ్లం. నలుగురం డ్యాన్సర్లమే. అసలు డ్యాన్స్ నేర్చుకుంటామన్నప్పుడే నాన్న ఇష్టపడలేదు. ఇక నటనా! అమ్మ మాత్రం సపోర్ట్ చేసేది. ‘వాళ్లేం చేసినా నాకు అభ్యంతరం లేదు, నా పెంపకం మీద నాకు నమ్మకముంది ’ అనేది. దాంతో నాన్న కూడా సరే అన్నారు.
మీ తెలుగులో కాస్త తేడా ఉంటుంది. తెలుగువారు కాదా?
నా మాతృభాష హిందీ. మా ముత్తాతల కాలంలోనే మావాళ్లంతా హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయారు. దాంతో ఇక్కడే పుట్టి పెరిగాను. ఇంట్లో హిందీలోనే మాట్లాడుకునేవాళ్లం. మా చుట్టుపక్కల గుజరాతీవాళ్లు, మరాఠీవాళ్లే ఉండేవారు. దాంతో తెలుగు అంతగా రాలేదు.
ఇంతవరకూ ఎన్ని సీరియల్స్ చేశారు?
ఇన్ని అని చెప్పలేను కానీ అన్నీ మంచివి చేశానని మాత్రం చెప్పగలను. నేనంటే ఏంటో అందరికీ తెలిపిన రుతు రాగాలు, కస్తూరి, ఆడది, ఎండమావులు, కావ్యాంజలి, గోరింటాకు, శాంతినివాసం, చంద్రముఖి... ఎన్నో మంచి సీరియల్స్, మంచి పాత్రలు. హిందీలోనూ చేశాను.
సినిమాలు తక్కువగా చేశారు!
ఎందుకని?‘స్టూడెంట్ నం.1’ తీస్తున్నప్పుడు, తన ‘శాంతినివాసం ’ సీరియల్ టీమ్‌ని తీసుకొమ్మని రాఘవేంద్రరావు చెప్పడంతో రాజమౌళి మాకందరికీ ఆ సినిమాలో చాన్స్ ఇచ్చారు. తర్వాత శ్రీరామ్, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఈ అబ్బాయి చాలా మంచోడు, కబడ్డీ కబడ్డీ, సంతోషం తదితర చిత్రాలు చేశాను. మంచి పాత్రలు వస్తే చేస్తున్నాను తప్ప అవే చేయాలని ఆశపడటం లేదు.
ఈ మధ్య ఏదో కొత్త గెటప్పులో కనిపిస్తున్నారు?
తెలంగాణ వీరనారి ‘చాకలి ఐలమ్మ ’ జీవితాన్ని సినిమా తీస్తున్నారు. ఐలమ్మగా నేను చేస్తున్నాను. ఆ గెటప్పే అది.
మీవారు (కర్ర నాగేష్) కూడా నటుడే కదా?
అవును. రుతురాగాలులో కలసి నటించాం మేము. అయితే నటన అనేది ఆయన వృత్తి కాదు, ప్యాషన్. శ్రీరామ్ లైఫ్ ఇన్సూ రెన్‌సకి వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నో అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఏదైనా మంచి పాత్ర దొరికితే చేస్తారు కానీ తన మొదటి ప్రాధాన్యత మాత్రం ఉద్యోగానికే.
నటిగా సంతృప్తి పొందినట్టేనా ?
పూర్తిగా. ఎవరెవరో ఫోన్లు చేసి మీరంటే ఇష్టమని చెప్తుంటే సంతోషమేస్తుంది. కానీ కొంతమంది ఏదేదో మాట్లాడేస్తుంటారు. దాంతో అవాయిడ్ చేయాల్సొస్తుంటుంది. వాళ్లేమో మాకు పొగరునుకుంటారు. మాకూ పర్సనల్ లైఫ్ ఉంటుందిగా. అర్థం చేసుకుంటే బాగుంటుంది.
భవిష్యత్ ప్రణాళికలేమిటి ?
పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేయాలి. మా బాబు ఆర్యన్‌కి డ్రాయింగ్, స్పోర్ట్స్ ఇష్టం. పాప అదితిశ్రీకి వాళ్ల నాన్నలా ఎంతసేపూ చదువే. వాళ్లు కోరుకున్న లక్ష్యాల వద్దకు వాళ్లను జాగ్రత్తగా చేర్చడమే నా ముందున్న ఏకైక లక్ష్యం.
(And get your daily news straight to your inbox)
Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more
May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more
Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more
Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more
Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more