తెలుగు సినిమా తెరకు గ్లామర్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అయితే అందర్లోకి ఇలియానా మాత్రం సమ్ థింగ్ స్పెషల్. సన్నని శరీరంతో.., అందమైన నడము.., ఆపై వర్ణించలేని హొయలతో హీటెక్కించిది ఇల్లీభామ. తన నటనతోనే యువతకు కిక్కు ఎక్కించింది. తొలి సినిమాతో మొదలయిన క్రేజ్ ఇప్పటికి కొనసాగుతోంది. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే ఈ గోవా భామకు సినిమాకు కోటి సమర్పించుకోవటానికి సిద్దపడ్డారు నిర్మాతలు. తెలుగులో హీరోలకే పరిమితమైన కోటిని హీరోయిన్ల హక్కుగా చేసిందీ భామ. అయితే ఇప్పుడీ అమ్మడు అభిమానులకు షాకులాంటి వార్త చెప్పింది. తానింక తెలుగు సినిమాలో నటించనని తెగేసి చెప్పింది. ఇంతకీ ఇలియానా చెప్పింది నిజమేనా? ఎందుకిలా చేస్తోంది.
టాలీవుడ్ కు ఇక బై బై గుడ్ బై అని స్వయంగా ఇల్లినే ప్రకటించేసుకుంది. దీనిపై టాలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తోంది. తెలుగు ఇండస్ర్టీ అంటే తనకు తెగ ఇష్టమనే ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్ లో పర్మనెంట్ గా సెటిలవుతుదని టాక్ విన్పిస్తోంది. ఇప్పటికే బాలివుడ్ లో మూడు సినిమాలు చేసింది. మరో సినిమా త్వరలో విడుదల కానుంది. ఇంకా ఆఫర్లను పరిశీలిస్తోంది. దీనికి తోడు ఈ మద్య హాట్ ఫొటో షూట్ ఒకటి ఇచ్చింది. ఈ దెబ్బో ఇల్లీ ఉండే గల్లీకి నిర్మాతలు, డైరెక్టర్లతో పాటు యాడ్ కంపనీలు కూడా క్యూ కడుతున్నాయి. ఇంకేం లెక్కలేనంత పని దొరికింది. దీంతో ముందు వచ్చిన ముక్కు కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు.., టాలీవుడ్ ను వదలేసి బాలీవుడ్ కు చెక్కేసింది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more