కామెడి హీరోగా.., పాస్ గ్యారంటి సినిమాలు చేసే నటుడుగా గుర్తింపున్న అల్లరి నరేష్ రూటు మార్చకున్నాడు. అందాల భామ అనుష్క బ్రదర్ గా నటించేందుకు అల్లరి నరేష్ సిద్ధపడుతున్నాడు. ఈ మద్య రిలీజ్ అయిన సినిమాలు ఆశించినంత హిట్ కాలేదు. అయినా సరే తనేంటో నిరూపించుకునేందుకు అన్నగా.., తమ్ముడిగా అయినా పర్వాలేదు ప్రేక్షకుల ముందకు వస్తా అని చెప్తున్నాడు. అయితే ఈ సినిమాలో అనుష్క మాత్రం నటించటం లేదు. విషయానికొస్తే.., నరేష్ కొత్త సినిమాకు బ్రదర్ ఆఫ్ బొమ్మాలిగా పేరు పెట్టారు. సిరి సినిమా బ్యానర్లో వచ్చే ఈ చిత్రం త్వరలోనే సెట్లోకి ఎక్కనుంది.
సినిమా పేరు కోసం పోటి పెట్టగా నరేష్ పిలుపుకు మంచి స్పందనే వచ్చింది. కధను బట్టి సినిమాకు చాలా పేర్లు వచ్చాయి. అందులో నాటు బాంబు, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి పేర్లు పరిశీలించిన టీం.., చివరకు బ్రదర్ ఆఫ్ బొమ్మాళిని ఫైనల్ చేసింది. వీడు తేడా సినిమా తీసిన చిన్ని కృష్ణ నరేష్ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక అమ్మిరాజు కనుమిళ్ళి నిర్మాతగా ఉన్నారు. హీరోయిన్ విషయానికొస్తే.., మోనాల్ గజ్జర్ నరేష్ సరసన నటిస్తోంది. ఆ మద్య మెరిసి తర్వాత కన్పించకుండా పోయిన కార్తిక ఈ సినిమా ద్వారా మరోసారి లక్ టెస్ట్ చేసుకుంటానంటోంది. నరేష్ చెల్లిగా ఇందులో కార్తిక కన్పించనుంది. అనుష్కకు మంచి పేరు తెచ్చిన క్యారెక్టర్ బొమ్మాళి పేరును సినిమాకు పెట్టుకోవటంతో మంచి రెస్పాన్స్ వచ్చి ప్రయత్నం సక్సెస్ అవుతుందని నరేష్ నమ్మకంగా ఉన్నాడు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more