సౌత్ ఇండస్ట్రీ హాట్ భామ త్రిష, టాలీవుడ్ బాహుబలుడు రానా పీకల్లోతుదాకా ప్రేమలో మునిగిపోయారంటూ మీడియాలో వార్తకథనాలు, రూమర్లు నడుస్తున్న విషయం తెలిసిందే! గుట్టుచప్పుడు కాకుండా రాత్రి పార్టీపబ్బుల్లో... విదేశాల్లో వీరిద్దరూ రహస్యంగా కాలం గడుపుతున్నట్టు ఎన్నోరకాల గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. అయితే ఈ జంట మాత్రం తమ మీద వస్తున్న ఈ వదంతులను పట్టించుకోకుండా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. అలా అనీ తమ మధ్య వున్న రిలేషన్ షిప్ గురించి కూడా సరిగ్గా క్లారిటీ ఇవ్వడం లేదు. అప్పుడప్పుడు వీరిద్దరూ కలిసి మీడియాకి చిక్కినప్పుడల్లా.. మేమిద్దరం జస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అంటూ కామా పెట్టేస్తారు కానీ.. ఫుల్ స్టాప్ వచ్చేంతవరకు తమ మధ్య వున్న రిలేషన్ సెంటెన్స్ ని మాత్రం ముగించరు. ఇప్పటికే వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ ఎన్నోసార్లు వార్తాకథనాలు వచ్చినా... వాటిమీద వీరిద్దరి నుంచి ఎటువంటి స్పందన లభించలేదు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో మునిగిపోయారంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు.
నిన్నటికి నిన్న విదేశాల్లో రానాతో కలిసి త్రిష బాగా ఎంజాయ్ చేసిందంటూ వచ్చిన వార్తలపై కూడా ఈ జంట నోరు విప్పలేదు. మీడియా ఎంత అరిచి కేకలు పెట్టుకున్నా.. వీరు మాత్రం తమ మధ్య వున్న బంధాన్ని బయటపెట్టుకుండా రహస్యంగానే కొనసాగిస్తున్నారు. దీంతో మీడియావాళ్లు వీరిద్దరి మీద నుంచి ఫోకస్ తీసేసింది. బహుశా వారికి ఇదే అదునుగా అవకాశం లభించినట్లు అనిపించిందేమో! తమ మీద మీడియా కన్ను పడటం లేదని భావించిన తరుణంలో చెన్నైలోని త్రిష ఇంటికి రానా తరుచూ వస్తూ పోతూ వున్నాడని ఒక సమాచారం బయటపడింది. ఇన్నాళ్లవరకు విదేశాల్లోనే విహరించిన ఈ ప్రేమపక్షలు.. ఇప్పుడు ఏకంగా త్రిష తన ఇంటినే ప్రేమగూటిగా మార్చేసిందని కోలీవుడ్, టాలీవుడ్ లలో వార్తలు తెగ తిరగేస్తున్నాయి. ఇంతేకాదు.. త్రిష అమ్మ కూడా వీరిద్దరి రిలేషన్ కు అడ్డు చెప్పకపోవడంతో ఇంట్లోనే బిందాస్ గా ఎంజాయ్ చేసుకుంటున్నారని లోగడ వార్తలు వినిపిస్తున్నాయి.
మొన్నీమధ్యే ఈ ప్రేమజంట దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడి పెళ్లి వేడుకల్లో కనిపించి.. అందరి దృష్టిని తమవైపుకు ఆకర్షించిన విషయం తెలిసిందే! తమ మధ్య ఏమీలేదంటూనే వీరిద్దరు జంటగా ఇలా ఫంక్షన్లకు అటెండ్ అవ్వడం, రానా తరచూ త్రిష ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేయడాన్ని చూస్తుంటే.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడం ఖాయమంటూ పరిశ్రమలో వున్న విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. మరి తమ మీద వస్తున్న ఈ బెడ్ రూమ్ రూమర్లను ఈసారి తోసిపుచ్చుతారా లేదా గతంలోలాగే పట్టించుకోకుండా వదిలేస్తారా..? తోసిపుచ్చితే ఏమీ లేదుకానీ.. ఒకవేళ సైలెంట్ గా వుంటే మాత్రం వీరిమధ్య నడుస్తున్నది ఖచ్చితంగా ప్రేమవ్యవహారమేనంటూ అందరూ ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more