మెగాస్టార్ చిరంజీవి తన 59వ జన్మదిన వేడుక సందర్భంగా నేపాల్ టూర్ కి వెళ్లి.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే! అయితే ఈ టూర్ వెనకున్న రహస్యం ఏమిటి..? అని ప్రతిఒక్కరిలో మదిలో మెదులుతూనే వుంది. రాజకీయ కార్యకలాపాలలో భాగంగా అక్కడికి వెళ్లారా..? కేవలం పుట్టిన రోజు సందర్భంకోసం వెళ్లారా..? లేక తన 150వ సినిమాకు సంబంధించి ఏవైనా పనులు చేపట్టడానికి వెళ్లారా..? అంటూ ఎన్నోరకాల సందేహాలను లేవనెత్తుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ రహస్యం ఏమిటో బయటపడింది. చిరు తన 150వ చిత్రానికి సంబంధించి కార్యకలాపాల్లో భాగంగానే అక్కడికి వెళ్లారని స్పష్టం అవుతోంది.
దాదాపు 7 సంవత్సరాల తరువాత తిరిగి సిల్వర్ స్ర్కీన్ మీద ఎంట్రీ ఇచ్చుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి... ముందులాగే స్లిమ్, ట్రిమ్ అండ్ హ్యాండ్-సమ్ గా కనపించాలంటే చాలా కసరత్తు చేయాల్సి వుంటుంది. పుట్టినరోజుకు ముందు ఈయన విడుదల చేసిన తాజా స్టిల్స్ లో బాగానే కనిపిస్తున్నప్పటికీ.. ఈ తరానికి తగ్గట్టుగా ఇంకా స్లిమ్ అవ్వాలనే ఆలోచనలో నేపాల్ కు వెళ్లినట్టు సమాచారం! అలాగే తక్కువ వయస్సు వుండేట్టు చూపే ట్రీట్ మెంట్, ఫిట్నెస్, వెయిట్ లాస్ వంటి తదితర శారీరక మార్పులు చేయించుకుని.. నవమన్మథుడిలా తిరిగి రావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ‘‘స్పా’’ కూడా నేపాల్ లోనే వుంది. దానిపేరే ‘‘హిమాలయా రిట్రీట్ స్పా’’. ఇందులో ఆయుర్వేదిక్ మసాజ్ థెరపీ, హాట్‌స్టోన్ మసాజ్ థెరపీ, రీజువినేషన్ మసాజ్ థెరపీ, స్టీమ్‌బాత్ వంటివి ఎన్నోరకాలు వున్నాయి. పైగా ప్రపంచంమొత్తంమీదున్న ప్రొఫెషనల్ థెరపిస్టులు, బ్యూటీషియన్లు కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. ఈ స్పాలో వున్న ప్రత్యేకత ఏమిటంటే.. ఎవరైనా ట్రీట్ మెంట్ చేయించుకోవడానికి లోపలికెళ్తే... సరికొత్త యవ్వనంతో బయటకు వస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరు... తననుతాను పూర్తిగా మార్చుకోవడానికే నేపాల్ కు ప్రత్యేక టూర్ కు వెళ్లారు.
అంతేకాదండోయ్... ప్రతిరోజు చిరంజీవి రెగ్యులర్ గా యోగా కూడా చేస్తున్నారు. ఆహార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం! ఒకవైపు సినిమా ఏమో కేవలం కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని ఇండస్ట్రీలో చెప్పుకుంటుంటే.. మరోవైపు చిరంజీవి నవయవ్వనంగా కనిపించడానికి ఇన్ని కసరత్తులు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే.. చిరంజీవి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికే ఇలా చేస్తున్నారని చిత్రపరిశ్రమలో చెప్పుకుంటున్నారు. ఏదిఏమైనా.. చిరు తన 150వ చిత్రంలో సరికొత్త లుక్ తో కనిపించడానికే ఇలా నేపాల్ టూర్ కి వెళ్లినట్టు పరిశ్రమలో చర్చలు చేసుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more