బాలీవుడ్ లో ఒకప్పుడు ఐరెన్ లెగ్ భామగా పేరుతెచ్చుకున్న శృతిహాసన్ ప్రస్తుతం గోల్డెన్ లెగ్ హాట్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటించిన ఈ అమ్మడికి లక్కు బాగా కలిసొచ్చింది. ఈ సినిమా తర్వాత శృతి హీరోయిన్ గా నటించిన దాదాపు అన్ని చిత్రాలు ఘనవిజయం సాధించాయి. తెలుగులో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా శృతిహాసన్ కొనసాగుతుంది.
ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాష చిత్రాల్లో కూడా ఈ అమ్మడు తన హవా కొనసాగిస్తోంది. హీరోయిన్ గా తన సత్తా ఏంటో నిరూపించుకుంటూనే... మరోవైపు ఐటెం సాంగులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. హిందీ, తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగుల్లో శృతిహాసన్ తెగ చిందులేస్తోందని తెలిసింది. బాలీవుడ్ లో అర్జున్ కపూర్ తో కలిసి ఓ ఐటెం సాంగులో నటిస్తుంది. మహేష్ నటించిన ‘ఒక్కడు’ సినిమాను ప్రస్తుతం హిందీలోకి ‘తేవర్’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. అర్జున్ కపూర్, సోనాక్షి జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఓ స్పెషల్ ఐటెం సాంగులో నటిస్తుంది. అర్జున్ కపూర్ తండ్రి బోనీకపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఈ ఐటంసాంగ్‌లో అర్జున్‌తో కలిసి స్టెప్పులేసిన శృతిహాసన్ అందుకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీతో పాటుగా అటు బాలీవుడ్‌లోనూ కూడా శృతికి బాగా క్రేజ్ వుండటంతో బోనీ కపూర్ కూడా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడట. అయితే ఈ పాట షూటింగ్ సమయంలో అర్జున్ తో కలిసి శృతి బాగా ఎంజాయ్ చేసిందట. అర్జున్ కపూర్ బలవంతం చేయడంతో శృతి కూడా అతనితో కలిసి పార్టీని ఎంజాయ్ చేసిందని బాలీవుడ్ మీడియా టాక్.
ఏదేమైనా కూడా ఈ ఐటెం సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని చిత్ర యూనిట్ సంతోషంగా వున్నారు. ఈ సినిమాతో పాటుగా శృతి తెలుగులో మహేష్ హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమాలో కూడా ఓ ఐటెం సాంగులో నటిస్తుంది. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఈ రెండు పాటలు శృతికి ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more