నాగ చైతన్య లైలా తో బయటకు రావటం లేట్ అయింది. ఈ విషయంపై ఎన్నిసార్లు అడిగినా కారణం మాత్రం ఎవరూ చెప్పటం లేదు. కాని ఆలస్యం కావటంలో నాగార్జున కింగ్ మేకర్ గా పాత్ర పోషించినట్లు తెలుస్తొంది. వాస్తవానికి ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 12) విడుదల కావాల్సి ఉంది. అయితే అర్ధాంతరంగా విడుదలను ఇరవై రోజుల పాటు వాయిదా వేశారు. దీనికి కారణాలు వెతకగా.., నాగచైతన్యకు దెబ్బ పడకుండా నాగార్జున జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం వస్తోంది. అంటే ఈ సినిమా రష్ వీడియో చూసిన కింగ్.., పలు సీన్ల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇదేమిటి ఇలా తీశారు అని యూనిట్ ను నిలదీశారట. అటు లోపాలపై దర్శకుడు కూడా నోరు మెదపలేకపోయాడట.
దీంతో లైలా మామకు నచ్చని సీన్లు తిరిగి షూట్ చేశారు. వాటిని మళ్ళీ ఎడిట్ చేసి, డబ్ చేసి ఇలా పోస్ట్ ప్రొడక్షన్ లోని వివిద దశలు పూర్తి చేసుకోవటానికి ఇంకా కొద్ది సమయం పడుతుందని సినిమా యూనిట్ వర్గాలంటున్నాయి. లైలా కోసం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు తెరవాలని భావిస్తున్న నాగార్జున ఇందుకోసం అవసరమైన ప్రతి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ఈ ఘటనతో స్పష్టం అవుతోంది. నటుడిగా సామ్రాట్ అయిన నాగార్జున తండ్రిగా మెలుకువలు నేర్పతూ శబాష్ అనిపించుకుంటున్నారు. నటుడిగా మంచి గుర్తింపు పొందిన కింగ్ ఇప్పుడు కొడుకు కెరీర్ ను చైతన్యవంతంగా తీర్చిదిద్దుతూ మంచి తండ్రి అనిపించుకుంటున్నాడు.
ఒక లైలా కోసం సినిమా పాటలకు మంచి టాక్ వచ్చింది. గుండెజారి గల్లంతయిందే సినిమా తీసిన విజయ్ కుమార్ కొండ ఈ సినిమాను తీస్తున్నారు. పూజ హెగ్డే ఇందులో చైతు సరసన నటిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని
అక్టోబర్ లో విడుదల అయ్యేందుకు సిద్దం అవుతోంది. ఏ మాయ చేశావే సినిమాతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న చైతు.., ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ నిరూపించుకుంటాడని ఫ్యాన్స్ అంటున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more