గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతోంది. ఈ బక్కపలచని సుందరికి బాలీవుడ్ లో అవకాశాలు బాగానే వస్తుండడంతో తెలుగు చిత్రసీమ వైపు చూడడం మానేసింది. ‘బర్ఫీ’ చిత్రం ద్వారా హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఇలియానాకు ఇప్పుడు చేతినిండా సినిమాలున్నాయి. కింగ్ ఖాన్ షారుక్‌ఖాన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందన్న వార్తలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కు టాటా చెప్పేయాలని భావిస్తోందట. దీనిలో భాగంగా హైదరాబాద్ లో తన ఇంటిని అమ్మకానికి పెట్టింది అమ్మడు.
మణికొండలోని ల్యాంకో హిల్స్ లో ఆమెకు విలాసవంతమైన ఫ్లాట్ ఉంది. అప్పట్లో రూ.1.25 కోట్లకు కొన్న ఈ ఫ్లాట్ ధర ఇప్పుడు రూ.2 కోట్ల వరకు పలుకుతోందని అంటున్నారు. రాష్ట్ర విభజనతో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేస్తే ధర పడిపోయే అవకాశమున్నందన ఇప్పుడే బేరం పెడితే మంచిదని ఆమె భావిస్తోందట. అదీకాక ఇలియానాకు ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కోటి రూపాయలపైగా విలువ చేసే మరో ఫ్లాట్ ఉండడంతో హైదరాబాద్ ఆస్తిని వదులుకోవాలన్న నిర్ణయానికి వచ్చిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ఫ్లాట్ బేరసారాల సంగతి ఇలియానా తల్లి సమీరా చూస్తున్నారట. ఇప్పటికే కొంతమంది కొనుగోలుదారులు ఆమెను సంప్రదించినట్టు తెలుస్తోంది. అన్నికుదిరితే త్వరలోనే ఇలియానా ఇల్లు చేతులు మారుతుందని చెప్పుకుంటున్నారు. అయితే ఇలియానా అభిమానులు మాత్రం ఆమె ఇక తెలుగులో నటించదా అన్న బాధను వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more