మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ శనివారం (01-11-2014) నాడు 41 ఏటలో అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే! ఆనాడు బచ్చన్ కుటుంబసభ్యులు ఎంతో ఘనంగా ఆమె జన్మదిన వేడుకలను జరిపించారు. ఆ వేడుక సందర్భంగా ఎంతోమంది రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఎంతోమంది హాజరయ్యారు. నిజంగా చెప్పుకోవాలంటే... బచ్చన్ ఫ్యామిలీవాళ్లు ఐశ్వర్య బర్త్ డే ఫంక్షన్ ను ఒక పండుగలాగా జరుపుకున్నారని కొందరు అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. మీడియాలో ఆమె వేడుకలకు సంబంధించి ఎన్నో కథనాలు వచ్చాయి కూడా! అంతే బాగానే వుంది కానీ.. వేడుక అనంతరం ఐశ్వర్య తన మనసులోని ఆవేదనను బయటపెట్టింది. తన అత్తారింట్లో తనకు 24 గంటలు నిద్రపట్టడం లేదని ఆమె మనోభావాలను వ్యక్తం చేసింది. తప్పుగా ఆలోచించకండి.. బర్త్ డే రోజు ఒక్కటే తనకు రాత్రంతా నిద్రపట్టలేదని పేర్కొంది అమ్మడు!
ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య మాట్లాడుతూ.. ఊహ తెలిసినప్పటినుంచి ఏనాడూ పుట్టినరోజును ఇంత ఘనంగా జరుపుకోలేదని... బచ్చన్ కుటుంబసభ్యులు ఎంతో ఘనంగా తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించారంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. తన 41వ పుట్టినరోజును జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనంత ఘనంగా చేశారని ఆమె తెలిపింది. పుట్టినరోజు కంటే ముందునుంచే అతిథులు, శ్రేయోభిలాషులు ఇంటికి వచ్చి తనను బర్త్ డే విషేస్ చేశారని.. అలాగే ఆరోజు రాత్రంతా చాలామంది సన్నిహితులు ఫోన్ చేసి విషెస్ చెప్పారని.. అందువల్లే రాత్రంతా నిద్రపోలేదని తెలిపింది. ఇక మరుసటి బర్త్ డే రోజు హడావుడి మరీ ఎక్కువగ జరిగిందని తెలిపింది. ఆ రోజు రాత్రికూడా పార్టీలతో గడిచిపోయిందని.. ఇలా మొత్తంగా 24 గంటలు నిద్రలేకుండా గడపాల్సి వచ్చిందని నాలుగుపదుల సుందరి తెలిపింది.
అలాగే సినిమాల్లో తన రీఎంట్రీ గురించి కొన్ని విశేషాలు చెబుతూ... వచ్చే ఏడాది నుంచి నటిగా ఫుల్ బిజీగా వుంటానని తెలిపింది. ప్రస్తుతం సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘‘జజ్బా’’ సినిమాలో నటిస్తున్నానని.. అలాగే మరికొన్ని సినిమాలను ఒప్పుకోబోతున్నానని తెలిపింది. 2015లో తాను ఫుల్ బిజీ అంటూ తెలిపింది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more