వరుస విజయాలతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాట్ భామ పరిణీతి చోప్రా... తాజాగా తన మనసులో వున్న ఒక కోరికను వ్యక్తపరిచింది. ఇంతవరకు తాను నటించిన చిత్రాలు తనకు అంతగా సంతృప్తిపరచలేదని.. కానీ ‘‘కిల్ దిల్’’ సినిమాతో ఆ కోరికను ఖచ్చితంగా తీసుందున్న నమ్మకాన్ని ఈ బొద్దుగుమ్మ తెగ ముచ్చటపడుతోంది. ఇంతకీ ఆ కోరిక ఏమనుకుంటున్నారా..?
నిజానికి చిత్రపరిశ్రమలో వున్న తారలందరికీ స్టార్ డమ్ సంపాదించాలని ప్రతిఒక్కరికీ ఆశ వుంటుంది. అలాగే అవార్డులు గెలుచుకోవాలనే కోరిక వుంటుంది. అలాగే ఈ అమ్మడికి ఓ అవార్డు గెలుచుకోవాలని ఎప్పటినుంచో వుందని తెలుపుతోంది. పైగా మామూలు అవార్డు కాదు.. జాతీయ అవార్డు సంపాదించాలని అనుకుంటోంది అమ్మడు. గతంలో నటించిన సినిమాలన్నింటికీ మంచి స్పందన వచ్చింది కానీ.. నా నటనకు గుర్తింపుగా ఏ అవార్డు లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఈ అమ్మడు! కానీ తాను తాజాగా నటించిన ‘‘కిల్ దిల్’’ చిత్రానికి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది.
‘‘ఇప్పటివరకు ప్రేక్షకులు నన్ను హీరోయిన్ గా ఎంతగానో ఆదరించారు. వాటి ఆదరణతోపాటు నాకు అవార్డులు కూడా కావాలి. ఇంతకుముందు నటించిన సినిమాలు ఆ కోరికను తీర్చలేదు కానీ.. ఇప్పుడు నేను నటించిన ‘‘కిల్ దిల్’’ సినిమా ఆ కోరికను ఖచ్చితంగా తీరుస్తుందనే నమ్మకం నాలో వుంది. అందులోని నా పాత్రకు జాతీయ అవార్డు వస్తుందన్న ఆశ వుంది. గతంలోకంటే ఈ చిత్రంలో నా పాత్ర చాలా వెరైటీగా వుంటుంది. మరి అవార్డు వస్తుందో.. లేదో.. చూడాలి!’’ అని వెల్లడిస్తోంది అమ్మడు. ఇంకొక విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో ఈ అమ్మడు అందాలు బాగానే ఆరబోసిందని సమాచారం!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more