లేదులేదంటూనే చివరికి సమంత తన లవర్’బాయ్ సిద్ధార్థ చెంతకు చేరినట్లు తెలుస్తోంది. ఆమధ్య వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్నాళ్లపాటు వార్తలు మీడియాలో బాగానే షికార్లు చేశాయి. పైగా గుడికి వెళ్లి అర్చనలు - పూజలు లాంటివి కార్యక్రమాలు చేయడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. కానీ.. ఈ ప్రేమ వ్యవహారాల గురించి ప్రస్తావనలు వచ్చినప్పుడల్లా తమ మధ్య కేవలం ఫ్రెండ్’షిప్ మాత్రమే వుందని, తాము ప్రేమించుకోవడం లేదని తమ ప్రేమను కొట్టిపారేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే.. వీరిమధ్య లవ్ రిలేషన్ ఇంకా కొనసాగుతూనే వుందనే అనుమానాలు మళ్లీ పుట్టుకొస్తున్నాయి.
మలయాళంలో సూపర్’హిట్ అయిన ‘బెంగుళూరు డేస్’ చిత్రాన్ని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని స్క్రిప్టు వర్క్ కూడా ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. ఈ సినిమాకోసం దర్శకుడు ఇటీవల సిద్ధార్థ్, సమంతాలతో చర్చించాడనీ, వారిద్దరూ కలిసి నటించేందుకు అంగీకరించారని సమాచారం! అంతేకాదు.. జనవరి నెలలోనే దీని షూటింగ్ కూడా మొదలవుతుందని వార్తలొస్తున్నాయి. దీంతో ఈ ప్రేమపక్షులు తిరిగి ఒకే గూటికి మళ్లీ చేరనున్నాయని, వీరిమధ్య ఇంకా లవ్ ఎఫైర్ నడుస్తూనే వుందని, అందుకే చిత్రం చేయడానికి అంగీకరించారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి దీనిపై వారిద్దరి కామెంట్లు ఎలా వుంటాయో చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more