నందమూరి ఫ్యామిలీ హీరోల మద్య విభేదాలు ఉన్నాయని అందరికి తెలుసు. ఇదే సమయంలో సాయం కోసం అంతా ఒక్కటవుతారని కూడా తెలిసిందే. గతంలో చాలాసార్లు ఇది ప్రూవ్ అయింది కూడా. జనవరి 1న జరిగిన ‘పటాస్’ ఆడియో విడుదల కార్యక్రమంలో కళ్యాణ్ రామ్ తో కలిసి తారక్ సందడి చేశాడు. అన్నయ్య కార్యక్రమానికి ఆహ్వానం లేదనీ..తమ్ముడికి థ్యాంక్స్ అక్కర్లేదని నందమూరి సోదరులిద్దరూ ఒక్కటే అన్నట్లుగా వ్యవహరించారు. అప్పుడలా అన్నయ్య ఆడియో రిలీజ్ కు వచ్చిన తారక్.., తమ్ముడిగా మరో సాయం చేస్తున్నాడు. అదే మాట సాయం.
ఈ మద్య ఒకరి సినిమాలకు మరొకరు వాయిస్ ఇవ్వటం సాధారణమయింది. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. తాజాగా ఎన్టీఆర్ కూడా కళ్యాణ్ రామ్ కోసం వాయిస్ ఇస్తున్నాడట. ‘పటాస్’ మూవీకి తారక్ గొంతు కలిపినట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఎందుకంటే.., అంతకుముందు ‘పటాస్’లో యంగ్ టైగర్ డాన్స్ చేశాడని పుకార్లు వచ్చాయి. కాబట్టి ఈ వాయిస్ ఓవర్ కూడా కేవలం పుకారేనా లేక నిజంగా ఇచ్చాడా అనేది సినిమా విడుదల అయితేనే తెలుస్తుంది.
కళ్యాణ్ రామ్ పోలిస్ ఆఫీసర్ గా కన్పిస్తున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శృతి సోది హీరోయిన్ గా నటిస్తుండగా.., సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. నూతన సంవత్సర కానుకగా విడుదల అయిన మూవీ ఆడియోకు మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ బావిస్తున్నారు. తమ్ముడు ‘టెంపర్’ పేరుతో పోలిస్ ఆఫీసర్ గానే వస్తుండటంతో.., తారక్ కు ధీటుగా కళ్యాణ్ రామ్ ను అనిల్ రావిపూడి ఎలా చూపించాడా అని ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more