పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లోకెక్కుతోంది. మొదట్లో ఈ సినిమాని డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కించాల్సి వుండేది. కానీ.. ఈ చిత్రం అనుకున్న తేదీకి సెట్స్ పైకి వెళ్లకపోవడంతోపాటు చాలాకాలం గ్యాప్ రావడంతో అతను వెళ్లిపోయాడు. దాంతో ఈ చిత్రాన్ని స్వయంగా పవన్ దర్శకత్వం వహిస్తాడని ఆమధ్య వార్తలు వచ్చాయి కానీ.. ఇంతలోనే కె.ఎస్.రవీంద్ర (బాబీ) ఎంట్రీ ఇచ్చాడు.
బాబీ ఎంట్రీ ఇవ్వగానే.. అతడు కొన్నాళ్లు స్ర్కిప్ట్ వర్క్ లో బిజీ అయిపోయాడు.. ఆ తర్వాత అనుకోకుండా షూటింగ్ మొదలయ్యింది.. అంతా సవ్యంగానే జరుగుతోందని భావించారు. కానీ.. ఇంతలోనే హీరోయిన్ని మార్చేశారు. గతంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా అనిశా ఆంబ్రోస్ నటిస్తోందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కానీ.. తర్వాత కాజల్ అగర్వాల్ ని కథానాయికగా తీసుకున్నట్లు యూనిట్ వెల్లడించింది. సరే! కథానాయిక విషయంలో మార్పులుంటే పెద్ద ప్రాబ్లమేమీ లేదని అనుకున్నారు. ఇక అక్కడి నుంచి కొన్నాళ్లు బాగానే వుంది. ఇంతలోనే ఈ మూవీకి సంబంధించి మరో షాకింగ్ న్యూస్. ఈ చిత్రానికి ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్న జయనన్.. మూవీ నుంచి తప్పుకున్నాడని వార్త వచ్చింది. అతనికి, దర్శకుడు బాబీకి మధ్య అంతర్గతంగా గొడవలు జరిగిన నేపథ్యంలో అతడు మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ విదంగా జయనన్ తప్పుకోవడంతో పవన్ కి కాస్త బాధ కలిగించింది. ఎందుకంటే.. జయనన్, పవన్ మధ్య సన్నిహిత సంబంధం ఎప్పటినుంచో వుంది. వీరిద్దరు గతంలో కూడా కలిసి చేశారు. పవన్ నటించిన ‘బద్రి’, ‘తీన్ మార్’, ‘గబ్బర్ సింగ్’, ‘గోపాల గోపాల’ చిత్రాలకు జయనన్ ఫోటోగ్రాఫర్ గా పనిచేశాడు. అటువంటి వ్యక్తి వున్నట్లుండి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం నుంచి వెళ్లిపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. ఈ సినిమాలో ప్రధానపాత్రలో నటిస్తున్న పవన్ కల్యాణ్ షూటింగ్ నేపథ్యంలో సెట్స్ నుంచి బయటకు వచ్చేశాడని సమాచారం. ఇందుకు దర్శకుడు బాబీయే కారణమట. తాను అనుకున్నంత స్థాయిలో బాబీ వర్క్ అవుట్ పుట్ రావడం లేదని, అతని వల్ల తాను హ్యాపీగా లేనని పవన్ స్టేట్ మెంట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. పైగా అతని కారణంగానే జయనన్ బయటికి వెళ్లిపోవడం తనకి తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పవన్ భావించి, సెట్స్ నుంచి బయటకు వెళ్లిపోయి వుంటాడని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా లేనట్టేనని అనుకుంటున్నారు. అలా కాకపోతే.. బాబీ స్థానంలో మరో దర్శకుడు ఎంట్రీ ఇచ్చే అవకాశం వుందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more