టాలీవుడ్ నుండి నిన్నటి దాకా కేవలం స్టోరీలను మాత్రమే పట్టుకుపోయిన సల్లుభాయ్ ఈ మధ్యన హీరోయిన్లను కూడా పట్టుకెళుతున్నారు. తాజాగా మరో హీరోయిన్ ను బాలీవుడ్ లోకి తీసుకోనున్నాడు సల్లూ భాయ్. గతంలో నితిన్ తో జతకట్టిన ఈ భామను సల్లు బాయ్ నెక్ట్ సినిమాలో తన హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. అదా శర్మ. ఆమె తాజాగా నటించిన క్షణం చిత్రం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఈ చిత్రం ఆమె కెరియర్ కు ఒక మైలు రాయిగా నిలిచిపోవడమే కాకుండా ఒక భారీ ఆఫర్ తెచ్చిపెట్టింది.
తెలుగులో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ చిత్ర కథ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు బాగా నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాడు. ఈ చిత్రం యొక్క రీమేక్ రైట్స్ ను సాజిద్ నడియావాలా సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కీలకం. తెలుగులో ఆదాశర్మ నటించిన ఈ పాత్రలో సంగీతా బిజిలానీని ఎంపిక చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ఆఫర్ ఆదాశర్మకే వచ్చినట్లు సమాచారం. సల్మాన్ కి జోడీగా నటించనుందన్న మాట ఆదాశర్మ. పైగా ఇక్కడికీ బాలీవుడ్ లో మేకింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సల్మాన్ చేతిలో పడితే టాప్ హీరోయిన్స్ అయిపోయిన హిస్టరీ చాలా మందికే ఉంది. ఇప్పుడు క్షణంతో ఆదాశర్మకు కూడా ఇలాంటి లక్కీ ఛాన్స్ తగిలిందని ఇండ్రస్టీ జనాలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more