బాలకృష్ణ అభిమానులందరూ మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎదురు చూస్తూ ఉంటే బాలయ్య మోక్షజ్ఞ విషయంలో తీసుకున్న ఆశ్చర్యకర నిర్ణయం బాలయ్య అభిమానులకు షాకింగ్ న్యూస్ గా మారింది. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం మోక్షజ్ఞ బాలయ్య 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కి దర్శకుడు క్రిష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.
దీనికి కారణం మోక్షజ్ఞ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ముందు సినిమా నిర్మాణానికి సంబంధించి ముఖ్యంగా నటనకు సంబంధించి అన్ని విషయాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలి అనే ఉద్దేశ్యంతో బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. త్వరలో మొరాకోలో ప్రారంభం కానున్న ఈసినిమా యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో మోక్షజ్ఞ క్రిష్ దగ్గర సహాయకుడుగా పనిచేస్తాడని తెలుస్తోంది.
ఈసినిమాలో బాలయ్య వారసుడు ఒక ప్రత్యేక పాత్రలో కనిపించే విషయంలో క్లారిటీ లేకపోయినా మోక్షజ్ఞ్జ ఈసినిమాకు సహాయ దర్సకుడుగా పనిచేయడంఖాయం అని అంటున్నారు. బాలకృష్ణ సినిమాలలో హీరోగా మారకముందు తన తండ్రి నందమూరి తారక రామారావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సెంటి మెంట్ తో అదే విషయాన్ని మోక్షజ్ఞ విషయంలో కూడ బాలకృష్ణ అనుసరించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more