బాహుబలి సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి తెలుగు సినిమా పవర్ ఏంటో చూపించాడు. ప్రస్తుతం ఈ సినిమా కన్ క్లూజన్ వర్క్ లో బిజీగా ఉన్న రాజమౌళి తన తర్వాత సినిమాకి కూడ అంతే వేగంగా పావులు కదుపుతున్నాడు. నిజానికి ఎప్పటినుంచో తనకి ఎంతో ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడు. కానీ, ఇప్పుడు రాజమౌళికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు హీరో బాలకృష్ణ. ఇప్పుడు ఈ విషయమే ఫిలిం నగర్ లో హాట్ న్యూస్ గా మారింది.
విషయం ఏంటంటే, బాలయ్యబాబు వందో సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకై బాలయ్యబాబు రాజమౌళి ని సెట్ లోకి పిలిపించాడు. ఈ సెట్ లోనే బాలయ్యబాబు తన తనయుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే బాధ్యతలని రాజమౌళికి అప్పగించినట్లుగా చెప్తున్నారు అందరూ. ఈ విషయమై సుదీర్ఘ చర్చల అనంతరం రాజమౌళి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
ఇంకేముంది చినబాబు ఎంట్రీ గ్రాండ్ గా మారిపోయినట్లే. బాహుబలి లాంటి మెగా మేకింగ్ సినిమా తర్వాత రాజమౌళి కూడ ఒక కుర్రహీరోతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో మోక్షజ్ఞలాంటి యంగ్ హీరో జక్కన్న చేతిలో పడ్డాడని , ఇక చినబాబు ఎంట్రీ అదిరిపోవడం గ్యారెంటీ అని నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
మరో విషయం ఏంటంటే, ఒక మంచి ప్రేమకథని మోక్షజ్ఞకి సెట్ అయ్యే కథని రెడీ చెయ్యమని తన తండ్రి విజయేంద్రప్రసాద్ కి రాజమౌళి చెప్పాడట. దీంతో చినబాబు లవ్ స్టోరీ ఎప్పుడు రెడీ అవుతుందో , ఈ సినిమా అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బాలయ్యబాబు ఫ్యాన్స్.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more