టాలీవుడ్ లో ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా మారిపోతుందో అస్సలు చెప్పలేం. స్టార్ హీరోగా ఒకప్పుడు వెలుగు వెలిగిన వారు తిరిగి అదో:పాతాళానికి పడిపోయే స్టేజీకి దిగజారగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్లుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అయితే వీరిలో రాత్రికి రాత్రే స్టార్లుగా ఎదిగిన వారి కంటే, తమ స్వయంకృషితో పైకొచ్చిన వారే ఎక్కువ. అదే సమయంలో మధ్య మధ్యలో వారు చేసే ప్రయోగాలు వారికి మంచి గుణపాఠాలు కూడా నేర్పుతుంటాయి. ముఖ్యంగా హీరోలుగా మారిన ఆర్టిస్టుల విషయంలో...
ఇక విషయానికొస్తే... రీసెంట్ గా ఓ టాలీవుడ్ ఆడియో పంక్షన్ జరిగింది. దీనికి టాలీవుడ్ టాప్ హీరో గెస్ట్ గా హాజరై సినిమాకు కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టాడు. అయితే కమెడియన్ నుంచి హీరోగా మారిన ఆర్టిస్ట్ గారి పంక్షన్ కి... అదే రూట్ లోనే ప్రయాణించిన మరో ఇద్దరు నటులు గెస్టులుగా హాజరయ్యారు. అందులో ఒకరు సీనియర్ కమెడియన్ కాగా, మరోకరు దశాబ్దంపాటు టాలీవుడ్ ను ఏలి తర్వాత పూర్తిగా హీరోగా మారిపోయాడు.
ఇక సదరు సీనియర్ నటుడు మాట్లాడుతూ... ‘కమెడియన్లు కూడా హీరోలుగా రాణించగలరు. అయితే అది ఓ లాటరీ అని గుర్తుపెట్టుకోవాలి. లాటరీ అనేది ఒక్కసారే తగులుతుంది. అలా తగిలాక ఆ డబ్బులను జేబులో పెట్టుకుని రిలాక్స్ అయిపోవాలి. అంతేగానీ మళ్లీ మళ్లీ లాటరీ టిక్కెట్లు కొనగూడదు. కమెడియన్‌గానే కొనసాగాలి’ అంటూ కొత్త హీరోకి క్లాస్ పీకాడు.
అయితే ఆ పక్కనే ఉన్న కమెడియన్ టర్న్ హీరో ఈ మాటలతో ఒక్కసారిగా హర్టయ్యాడంట. ఎందుకంటే గత కొంత కాలంగా ఆయన ఖాతాలో ఒక్క హిట్ లేదు. కానీ, సదరు వ్యాఖ్యలు ఆయన్ని ఉద్దేశించి చేసినవో లేదో తెలీదుగానీ ప్రస్తుతం మీడియా మాత్రం ఆ వ్యాఖ్యలు ముమ్మాటికీ అతన్ని ఉద్దేశించి చేసినవే అంటూ వార్తలు రాసేస్తున్నాయి. ఇంతకీ ఆ వ్యాఖ్యలు చేసింది ఎవరోకాదు కాట్రవల్లి ఆలీ. మరి ఆ కామెంట్లు ఎవరిని ఉద్దేశించి చేసినవో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది కూడా.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more