ఫ్రెష్ ఫేస్ లకు టాలీవుడ్ లో ఒకటి రెండు హిట్లు పడ్డాయంటే చాలూ వాళ్ల రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. ఆపై స్టార్ హీరోలతో జత కడుతూ సేఫ్ సైడ్ గా తమ కెరీర్ నావను ముందుకు నడుపుతుంటారు కొందరు హీరోయిన్లు. కానీ, హిట్లే లేని ఆ హీరోయిన్ కేవలం క్రేజ్ మూలంగా చేస్తున్న డిమాండ్లు మన మేకర్లకు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి.
గతంలో ఓ రెండు చిత్రాల్లో నటించిన ఈ ముంబై భామ తర్వాత గ్యాప్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నటన గురించి పక్కనపెడితే(ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది) కేవలం గ్లామర్ షోతో ఏదో నెట్టుకొచ్చేసింది. కేవలం స్టార్ హీరోతో చేసిందన్న ఒకే ఒక్క రీజన్ తో బాగానే ముట్టజెప్పారు. ఇది చాలదన్నట్లు మరో యంగ్ హీరో తో మూవీకి ఏకంగా కోటిన్నర పారితోషకం ఆఫర్ చేశారు. ఇన్ని అయ్యాక ఇక నేల మీద ఉంటుందా?. తనని అప్రోచ్ అయ్యేవారిని గొంతెమ్మ కోర్కెకలతో చుక్కలు చూపిస్తుందంట.
మాములుగా ఏదైనా షోరూంల ఓపెనింగ్ కు స్టార్ హీరోయిన్లు సైతం 3 లక్షల దాకా డిమాండ్ చేస్తుంటారు. ఇంకొందరు మాత్రం కేవలం కాస్ట్ లీ గిఫ్ట్ లతో వదిలేస్తారు. కేవలం 30 నిమిషాల్లో ముగించే తంతు అయినప్పటికీ పాపులారిటీ వస్తుందన్న ఒకే ఒక ఉద్దేశ్యంతో నిర్వాహకులు ఆ మాత్రం వెచ్చిస్తుంటారు. అయితే రీసెంట్ గా ఓ పాపులర్ మాల్ వాళ్లు తమ షాప్ ఓపెనింగ్ కు ఇందాక చెప్పుకున్న కొత్త హీరోయిన్ దగ్గరికి వెళ్లారంట. అయితే తాను మాత్రం 10 లక్షలు ఇస్తేనే వస్తా అంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పేయటంతో దండం పెట్టేసి మరో స్టార్ హీరోయిన్ తో కానిచ్చేస్తున్నారని టాక్.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more