టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కెరీర్ పూర్తిగా డోలాయమానంలో ఊగిసలాడుతోంది. ఓవైపు ప్రేమ, పెళ్లి అంటూ శ్రీయా భూపాల్ తో ఎంగేజ్ మెంట్ అయ్యాక పెళ్లి రద్దు చేసుకుని వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత రెండో సినిమా ఓకే అవ్వక ఇబ్బందులు పడుతుండటంతో నాగ్ లో కొద్దిపాటి టెన్షన్ మొదలైంది. ఇది చాలదన్నట్లు దగ్గుబాటి ఫ్యామిలీతో నాగ్ వియ్యం అందుకోబోతున్నాడన్న వార్త ఫిల్మ్ నగర్ లో ఒక్కసారిగా సంచలనంగా మారింది. సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ కుమార్తెతో అఖిల్ వివాహం జరగనుందంటూ ఓవార్త నిన్నంతా సోషల్ మీడియా చక్కర్లు కొట్టింది.
ఈ నేపథ్యంలో సీన్ లోకి ఎంటర్ అయిన నాగ్, కొంత మంది మీడియా ప్రతినిధులతో ఆ రూమర్ ను ఖండించినట్లు తెలుస్తోంది. అఖిల్ కు ఇప్పుడు సినిమాలు తప్ప వేరే ధ్యాస లేదని, త్వరలో రెండో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం ఇచ్చాడంట. దయచేసి అఖిల్ పై ఇలాంటి లేనిపోని కథనాలు రాయొద్దంటూ రిక్వెస్ట్ కూడా చేశాడంట. అయితే ఈ వార్త సోషల్ మీడియాకు ఎక్కడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలిసిపోయింది.
కేవలం హిట్స్ కోసం పరితపించే కొన్ని వెబ్ సైట్స్ ఈ ప్రచారం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటివి వాటిలో ఎప్పుడూ ముందుండే ఓ వెబ్ సైట్ వెంకీ డాటర్ వెడ్స్ నాగ్ సన్ అంటూ కథనం ప్రచురించగా, దాన్ని గుడ్డిగా ఫాలో అవుతూ మరికొన్ని దాన్ని కొనసాగించాయి. పైగా దానికి సామ్-చైతూ కంటే ముందుగా అఖిల్ కు చేయాలని నాగ్ డిసైడ్ అయి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటూ పక్కా స్టోరీతో రాసేసింది. అయితే నిజనిర్థాణలు లేకుండా ఇలాంటి ఫేక్ న్యూస్ లు రాయటం వల్ల వాళ్లకు ఒరిగేం లేదని పలువురు సినీ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more