నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫస్ట్ ఇంపాక్ట్ మాములుగా లేదు. సాలిడ్ గా ఉందంటూ టాలీవుడ్ మొత్తం ప్రశంసలు కురిపిస్తోంది. డేరింగ్ కంటెంట్.. అద్బుతమైన డీవోపీతో ఆకట్టుకున్న టీజర్ అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా బన్నీ లుక్కు.. పాత్ర చిత్రీకరణ వైవిధ్యంగా గత చిత్రాలకంటే భిన్నంగా ఉండబోతుందని సంకేతాలు అందించింది.
ఫెరోషియస్ సోల్జర్ పాత్రలో బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్ మెస్మరైజ్ చేసేసింది. దేశమంటే విపరీతమైన ప్రేమ.. అలాగే తప్పు చేసే వాళ్లంటే పట్టరాని కోపం.. తన మీద తనకు అదుపులేని సైనికుడి పాత్రలో బన్నీ కనిపిస్తున్నాడు. ఐతే ఒక రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే ఇలాంటి పోలికలతోనే మరో చిత్రం మనకు టాలీవుడ్ లో కనిపిస్తుంది. అదే సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘ఆగ్రహం’ చిత్రం. ఓ ఆర్మీ అధికారి సెలవుల్లో వచ్చి బాధ్యతారాహిత్యంతో ఉన్న జనాల్ని చూసి కోపం పట్టలేకపోతాడు. ఎక్కడికక్కడ తప్పు చేస్తూ కనిపించిన వాళ్లందరినీ కొట్టేస్తుంటాడు. దీని వల్లే అతను చాలా ఇబ్బందులు పడతాడు.
దీంతో నా పేరు సూర్య... చాలా వరకు ఆ సినిమాను గుర్తుకొస్తోంది. అయితే ఇక్కడ దాదాపుగా అంతా మిలిటరీ లోకేషన్లే కనిపిస్తుండటంతో అది కాదనే వారు లేకపోలేదు. యాంగర్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ మినహాయిస్తే ఆ కథకు.. ఈ కథకు ఏమాత్రం పోలిక లేదని చెప్పేవాళ్లు లేకపోలేదు. ఏదిఏమైనా 29 గంటల్లో 10 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ తో బన్నీ ఫస్ట్ ఇంపాక్ట్ మాత్రం దూసుకుపోతోంది. మరి డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టిన వక్కంతం వంశీ ఆ కథ స్ఫూర్తితోనే తీర్చిదిద్దుతున్నాడా తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more