SMS Jokes
పెళ్లయిన తరువాత ఏం జరిగిందంటే..!

ఒక ఫ్రెండ్ తన స్నేహితుడికి ఈ విధంగా మెసేజ్ పంపించాడు....

‘‘ఒక వ్యక్తికి ఆరు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ అతను పెళ్లి చేసుకున్న కొన్నిరోజుల తరువాత ఆ వ్యక్తి భార్య చనిపోతుంది. ఈవిధంగా చేసుకున్న ఆరు పెళ్లిళ్లలో ఆరుమంది భార్యలు చనిపోతారు. 

తరువాత అతను ఇంకొక భార్య కోసం వెదుకులాట మొదలుపెట్టాడు. కానీ అతనితో జరిగిన ఆ సంఘటనను చూసి ఎవరూ అతనికి పిల్లనివ్వడానికి ముందుకు రావట్లేదు. 

చివరికి ఒక అమ్మాయి ఇతనికి దొరుకుతుంది. ఆ అమ్మాయికి కూడా ఆరు పెళ్లిళ్లు జరిగి వుంటాయి. వాళ్లు కూడా చనిపోయి వుంటారు. 

చివరికి వీళ్లిద్దరూ కలుసుకుని పెళ్లి చేసుకుంటారు. వీరి పెళ్లికి విచ్చేసిన వారందరు ‘‘తరువాత వీళ్లిద్దరికి ఏమవుతుందా’’ అనే ఆందోళనలో పడిపోయారు. 

వారిద్దరికి పెళ్లయిన మరుసటి రోజే.. మరుసటి రోజే... 

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

ముందు నాకు 50 రూపాయల బ్యాలెన్స్ రిచార్జ్ చేయించు. ఆ తరువాత మిగిలిన సస్సెన్స్ స్టోరీ పంపిస్తా’’. 

సిగ్గుతో చస్తున్నాను..

ఏడుస్తున్న యాపిల్ ని చూస్తూ.. అరటిపండు ఈ విధంగా అడిగింది..

అరటిపండు : ‘‘ఎందుకు ఏడుస్తున్నావ్?’’

యాపిల్ : ‘‘అందరూ నన్ను కట్ చేసి తినేస్తారు కదా.. అందుకు’’

అరటిపండు : ‘‘నువ్వు నాకంటే చాలా అదృష్టవంతురాలివి. నిన్ను కట్ చేసి తింటారు. కానీ నన్ను నా బట్టలు విప్పిమరీ తింటారు. సిగ్గుతో చస్తున్నా’’. 

భార్యాభర్తల గుసగుసలు వాట్స్ యాప్ అండ్ ఫేస్ బుక్ లో...

వాట్స్ యాప్ లో :

భార్య : ‘‘ఇంటికి ఎప్పుడొస్తావ్?’’

భర్త : ‘‘తెలీదు. తలకాయ్ తినొద్దు’’!

 

ఫేస్ బుక్ లో : 

భార్య : ‘‘హెలో డియర్.. ఎలా వున్నావ్. ఇంటికి ఎప్పుడొస్తావ్? ప్రపంచంలో వున్న భర్తలలో నువ్వే చాలా బెస్ట్. మిస్ యూ బేబీ.. ప్లీజ్ త్వరగా ఇంటికి వచ్చేయ్’’. 

భర్త : ‘‘నువ్వు నా జీవితంలో వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నీలో ఇంత మంచి భార్య దాగివుండడం నా అదృష్టం. ప్రియా.. నేను త్వరగానే వచ్చేస్తా’’

సొల్లుగాడు నువ్వే

ఒక అబ్బాయి తన ఫ్రెండ్ కి మెసేజ్ పంపుతూ... 

మల్లిగాడు, పిల్లిగాడు, సోల్లిగాడు అని ముగ్గురు స్నేహితులున్నారు. 

మల్లిగాడు బీటెక్ చదువుతున్నాడు. 

పిల్లిగాడు డిగ్రీ చదువుతున్నాడు. 

సొల్లిగాడు ఈ మెసేజ్ ని చదువుతున్నాడు. 

''సొల్లుగాడు నువ్వే''

ఒక అబ్బాయి తన ఫ్రెండ్ కి మెసేజ్ పంపుతూ... 

మల్లిగాడు, పిల్లిగాడు, సోల్లిగాడు అని ముగ్గురు స్నేహితులున్నారు. 

మల్లిగాడు బీటెక్ చదువుతున్నాడు. 

పిల్లిగాడు డిగ్రీ చదువుతున్నాడు. 

సొల్లిగాడు ఈ మెసేజ్ ని చదువుతున్నాడు. 

ఏడు కొండలవాడ వెంకటరమణ....

ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద .

స్వామి నాకు FEB 14 కల్లా ఒక మాంచి లవర్ దొరికితే E SMS చదివేవాళ్ళకి గుండు కొట్టిస్తా .