ఒకరోజు ఒక మహిళ ఎక్కువగా నొప్పిస్తున్న తన దంతాన్ని తీయించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళుతుంది.
మహిళ : డాక్టర్ గారూ.. నాకు దంతంలో ఎక్కువగా నొప్పి వుంది. మీరెలాగైనా దానిని తీసేసి.. నొప్పి నుంచి నన్ను ఉపశమనం చేయండి.
డాక్టర్ : సరే.. ముందు నీ నోరును తెరువు.
మహిళ : ఇదిగో.. తెరిచేశాను.. త్వరగా తీసేయండి.
డాక్టర్ : ఇలా కాదమ్మా.. ఇంకొంచెం పెద్దగా నోటిని తెరువు.
డాక్టర్ అలా చెప్పగానే ఆ మహిళ తన నోరును ఇంకా పెద్దగా ఓపెన్ చేస్తుంది.
డాక్టర్ : నాకు సరిగ్గా కనిపించడం లేదు. ఇంకా పెద్దగా తెరువు.
ఆ మహిళకు వేరే దిక్కులేక మొత్తం నోరును పైకి లేపి పెద్దగా తెరిచేస్తుంది.
డాక్టర్ : ఇంకొంచెం పెద్దగా తెరువమ్మా!
డాక్టర్ ఆ మాట చెప్పగానే మహిళ కోపంతో... ‘‘యాఁ.. నోటి లోపల కూర్చొని దంతాన్ని బయటికి తీస్తావా ఏంటి? ఇంకా తెరువు తెరువుమంటున్నావు!’’
ఒకరోజు ఒక మహిళ చెకప్ చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళుతుంది. ఆమె కళ్లు నల్లగా, నీలం రంగులో మారిపోయి వుంటాయి. అప్పుడు ఆమెను చూసి...
డాక్టర్ : ఏమైంది? ఏంటి మీరు అలా వున్నారు?
మహిళ : డాక్టర్ గారు... నాకేం చేయాలో అస్సలు అర్థమవ్వడం లేదు? నా భర్త రోజు తాగి వస్తాడు. వచ్చి రాగానే నన్ను కొట్టడం మొదలు పెడతాడు.
డాక్టర్ : దీనికి సంబంధించి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన చికిత్స వుంది. నీ భర్త ఎప్పుడైతే తాగి ఇంట్లోకి వస్తాడో.. అప్పుడు నువ్వు గోరువెచ్చని నీరులో కొంత ఉప్పు కలుపుకుని పుక్కిలించడం మొదలుపెట్టు. అలాగే చేస్తూనే వుండు. నిలబెట్టకుండా చాలాసేపు వరకు పుక్కిలిస్తూనే వుండు.
ఇలా డాక్టర్ చెప్పినట్లుగానే మహిళ రెండువారాల వరకు గోరువెచ్చని నీరులో ఉప్పు కలుపుకుని పుక్కిలిస్తూ వుంది. రెండు వారాల తరువాత డాక్టర్ దగ్గరకు వెళుతుంది. అప్పుడు ఆమె ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నట్లు డాక్టర్ కు కనిపిస్తుంది.
మహిళ : డాక్టర్ గారూ.. మీరు నిజంగానే ఒక బ్రహ్మాండమైన ఐడియాను చెప్పారు. ఇప్పుడైతే నా భర్త తాగి ఇంటికి రాగానే నేను పుక్కిలించడం చూసి ఆయన నన్ను ముట్టుకోవడం కూడా లేదు.
డాక్టర్ : చూశావా.. నోరును అదుపులో వుంచుకుంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో!
సరోజా : హమ్మయ్యా.. చివరికి నా కోరిక నెరవేరింది. అనుకున్నదే సాధించాను.
కావ్య : ఇంతకు ఏమైందే.. అంత సంతోషంగా వున్నావు?
సరోజా : ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే.. ఆ చోటు నుంచే దానిని వెతుక్కోవాలని పూర్వం పెద్దలు చెప్పింది నిజమే!
కావ్య : అదెలా సాధ్యమవుతుంది.? అయినా అది ఇప్పుడు నీకెందుకు?
సరోజా : ఎందుకంటే... లంచం తీసుకుంటూ పట్టుబడి పోయిన నా ఉద్యోగాన్ని.. తిరిగి అదే లంచం ఇచ్చి పొందాను కాబట్టి.!
ఒక రోజు కాంతం, తన స్నేహితురాళ్లయిన షకీలాతో మాట్లాడటానికి ఇంట్లోకి వెళ్లింది.
కాంతం : అవునే షకీలా.. నిన్న రాత్రి ఏంటి? మీ ఇంట్లో నుంచి గట్టిగా అరుపులు వినిపించాయి. ఏం జరిగింది?
షకీలా : అలా ఏం లేదు కానీ.. మా ఆయన్ని నేను బాగా కొట్టాను.
కాంతం : అరుపులు అరిచేంత గట్టిగా మీ ఆయన్ని ఎందుకు కొట్టావ్?
షకీలా : నేను ఎంతో శ్రద్ధగా నవల చదువుతుంటే.. చీటికీమాటికీ డిస్టర్బ్ చేశాడు. అందుకే!
కాంతం : ఇంతకీ ఏ నవలా అంత శ్రద్ధగా చదువేదానివి ?
షకీలా : పతియే ప్రత్యక్ష దైవం!
ఒకరోజు ఒక జర్నలిస్టు, ఒక క్రీడాకారుడితో ఇంటర్వ్యూ చేస్తాడు. అప్పుడు
జర్నలిస్టు : ప్రతి మగాడి విజయ వెనుక ఒక స్త్రీ వుంటుందంటారు. అలాగే మీరు పరుగుపందెంలో ఫస్ట్ రావడానికి కారణం ఎవరైనా వున్నారా???
క్రీడాకారుడు : ఎందుకు వుండరండి.. మా ఆవిడే వుంది. నేను పరుగు తీస్తున్నపుడు మా ఆవిడ వెనుక నుంచి తరుముతున్నట్టు ఫీలవుతా...!
మహిళ : పండితులుగారు.. నాకు పెళ్లి అయి 5 సంవత్సరాలు అవుతోంది. అయినా నాకు ఇంతవరకు పిల్లలు లేరు.
పండితుడు : నేను బద్రినాథ్ వెళ్లి మీ పేరు మీద దీపం వెలిగించి వస్తాను. దానిని ఆపివేయడానికి మీ ఆయనను పంపించు. దేవుడు మీమీద దయ చూపిస్తాడు.
10 సంవత్సరాల తరువాత పండితుడు ఆ మహిళ ఇంటికి చేరుకుంటాడు.
అప్పుడు వాళ్ల ఇంట్లో మొత్తం 10 మంది పిల్లలు వుంటారు.
పండితుడు : చూశారా.. దేవుడు మిమ్మల్ని కనుకరించాడు కదా.. ఇంతకీ ఈ పిల్లల తండ్రి ఎక్కడ..?
మహిళ : మీరు బద్రినాథ్ లో వెలిగించిన దీపాన్ని ఆర్పేయడానికి వెళ్లారు. ఇంతవరకు తిరిగి రాలేదు.
లక్ష్మి : ‘‘ఏంటి సుజాత..! నిన్న రాత్రి నుంచి చూస్తున్నాను. చాలా డల్ గా వున్నావ్.. ఏమయింది?’’
సుజాత : ‘‘నీకెలా చెప్పాలో నాకర్థం కావడం లేదు.. నిన్న రాత్రి సినిమా హాల్లో నా పర్స్ పోయిందే’’
లక్ష్మి : ‘‘మళ్లీనా.. నీకెన్ని సార్లు చెప్పాను.. ఒళ్లు దగ్గర పెట్టుకోమని?’’
సుజాత : ‘‘అబ్బా..! ఆ సచ్చినోడు పర్స్ కోసమే అక్కడ చెయ్యి పెట్టాడని నాకేం తెలుసు’’