సిటీలో పోలీసులు ప్రజల రక్షణ కోసం ప్రముఖ కూడళ్లు, రహదారులు, సిటీ సెంటర్లలో సీసీటీవీలు పెట్టించారు. 24 గంటలు కంట్రోల్ రూమ్ లో సిటీలో ఏం జరుగుతుందోనని అందరూ ఒక కంటపెడుతుంటారు.
దీనినే అదునుగా తీసుకున్న ఒక సర్దార్.. పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఇలా అడుగుతాడు...
సర్దార్ : హెలో.. సార్ నాకు మీ సహాయం కావాలి. అందుకే ఫోన్ చేశాను.
కంట్రోల్ రూమ్ : ఆ చెప్పండి... మీకు ఎటువంటి సహాయం చేయగలం? మేమున్నది కూడా మీకు సహాయం చేయడానికే కదా!
సర్దార్ : అలా అయితే సరే... నాకొక చిన్న సందేహం.. మీ సీసీటీవీ కెమెరాలు నిజంగానే పనిచేస్తున్నాయా..?
కంట్రోల్ రూమ్ : అవునండి.. చాలా బాగా పనిచేస్తున్నాయి.
సర్దార్ : ఓహో.. అలా అయితే ఆ కెమెరాల నుంచి 5వ నెంబర్ రోడ్డు కనిపిస్తుందా?
కంట్రోల్ రూమ్ : ఆ కనిపిస్తోందండి.
సర్దార్ : 5వ నెంబర్ రోడ్డు వెనకాల వున్న కాలనీ కూడా కనిపిస్తోందా..?
కంట్రోల్ రూమ్ : అవునయ్యా కనిపిస్తోంది. ఇంతకి అక్కడ ఏమైందో చెప్పి చావు!
సర్దార్ : హీహీహీహీ.. అదేం లేదు సార్.. ఆ కాలనీలో వుండే రాజేష్ దుకాణం తెరిచి వుందో లేదో అడిగి తెలుసుకుందామని ఫోన్ చేశా..!
కంట్రోల్ రూమ్ : ఏరా.. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాం రా..? నీ తొక్కలోకి... నీ సంకలో పిట్ట రెట్టెయ్యా... నీ దంతాలు ఊడిపడా... నువ్వు నా ముందుకు రారా.. నిన్ను అక్కడికక్కడి పాతిపెడతా... నిట్టనిలువునా చీల్చేస్తా.. ఫోన్పెట్టరా ఫోన్ పెట్టు!
ఒకరోజు శాంతా తన భార్యతో కలిసి బయటకు వెళుతుంటాడు. అలా వెళుతుండగా దారిలో శాంతాకు తన ఫ్రెండ్ కనిపిస్తాడు. అయితే అతనిని అప్పుడే పోలీసులు పట్టుకుంటారు.
అది చూసిన శాంతా వెంటనే పోలీసుల అదుపులో వున్న తన ఫ్రెండ్ దగ్గరికి వెళతాడు. అప్పుడు...
శాంతా : ఏమైంది? పోలీసులు నిన్ను ఎందుకు పట్టుకున్నారు?
ఫ్రెండ్ : నేను నా భార్యను నిర్ధాంతరంగా చంపేశాను. అందుకే పోలీసులు నన్ను పట్టుకున్నారు.
ప్రెండ్ చెప్పిన మాటలు విన్న తరువాత శాంతా కొద్దిసేపటివరకు ఆలోచిస్తాడు. తరువాత తన ఫ్రెండ్ తో...
శాంతా : సరేలే.. శిక్ష ఎన్నాళ్లవరకు విధించారు?
ఫ్రెండ్ : 6 వారాలు....
అని చెబుతుండగానే శాంతా సంతోషంగా ఊగిపోతాడు.
శాంతా : ఏంటి..? కేవలం 6 వారాలేనా..! ఈ మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు?
అని తన ఫ్రెండ్ తో చెప్పి... ముందు, వెనకా చూసుకోకుండా దగ్గరలోనే వున్న పోలీసు నుంచి గన్ తీసుకుని తన భార్యను కూడా కాల్చి చంపేశాడు.
అది చూసిన శాంతా ఫ్రెండు ఏడ్చుకుంటూ శాంతాతో ఇలా అంటాడు...
ఫ్రెండ్ : నీయబ్బా..! ఇదేం చేశావురా గాడిద.. వెధవ.. సన్యాసి.. తెలివితక్కువ దద్దమ్మా.. పూర్తి మాట వినకుండానే ఎందుకు తొందరపడ్డావురా.. నేను చెప్పేది విను.. 6 వారాల తరువాత నాకు ఉరిశిక్ష విధిస్తారు.
శాంతా షాక్స్.. ఫ్రెండ్ రాక్స్.. పోలీస్ రాక్స్!
ఒకరోజు శాంతా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన బాంతాతో కలిసి ఒక పార్క్ కు వెళతాడు.
అక్కడ ఇద్దరు ఏకాంతంగా కూర్చుని వుండగా.. శాంతా తన ఫ్రెండ్ తో ఇలా అడిగాడు.
శాంతా : ఇంకేం విశేషాలు ఫ్రెండ్... ఇంట్లోవున్న నీ భార్య ఇప్పుడు ఎలా వుంది..? ఏమంటోంది?
బాంతా : అరె.. నిన్న రాత్రి మోకాళ్ల మీద నడుచుకుంటూ వచ్చి మరీ నన్ను బుజ్జగించింది తెలుసా!
శాంతా : ఏమంటున్నావ్ రా? నిజంగానేనా..? అసలు నమ్మొచ్చారా..?
బాంతా : నిజంగానే తను మోకాళ్ల మీద పడి వేడుకుంది?
శాంతా : కానీ ఎలారా? తను ఎప్పుడు నిన్నే కొడుతుంది కదా? ఇదెలా సాధ్యం?
బాంతా : అరె నిజంరా భాయ్!
శాంతా : అప్పుడేం చెప్పింది?
బాంతా : ఏమందంటే... ‘‘బెడ్ కింద నుంచి తొందరగా వచ్చేయ్.. నిజంగా నేను నిన్ను కొట్టను. ప్రామిస్’’ అని చెప్పింది!
ఒకరోజు శాంతా తన ఇద్దరు మిత్రులైన జపానీ, బ్రిటీష్ ఫ్రెండ్స్ తో కలిసి సముద్రంలో తిరగడానికి వెళతారు.
అయితే హఠాత్తుగా ఒక తుఫాను రావడం వల్ల వారు ఒక దీవిలో దిగిపోయారు.
ఆ దీవిలో ఎవ్వరూ లేరు.. నాలుగువైపులా ప్రశాంతంగా ఏ అరుపులు లేకుండా వుంది.
అప్పుడు వారు ముగ్గురు వెలుతురు కోసం వెదకడం మొదలుపెట్టారు.
అలా వెళుతూ వుండగా.. జపనీస్ వాడికి ఒక మాయాదీపం కనిపిస్తుంది. అతను దానిని మెల్లగా రుద్దగా.. అందులో నుంచి జినీ బయటకు వస్తాడు.
జీనీ వాళ్లతో ఇలా అంటాడు.. ‘‘మీ ముగ్గురికి నేను ఒక్కొక్క వరాన్ని ఇస్తాను. ఏం కావాలో కోరుకోండి’’
ఈ మాట అనగానే ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, ఆలోచనలో పడిపోతారు.
అందులో జపనీస్ ముందుకు వచ్చి... ‘‘నేను నా ఇంటికి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను. కాబట్టి నన్ను త్వరగా ఇంటికి పంపించు’’ అని కోరుకుంటాడు.
దీంతో ఆ జీనీ తన చేతులతో మాయ చేసి, ఆ జపనీస్ ని తన ఇంటికి పంపివేస్తాడు.
బ్రిటీష్ వాడు కూడా అదే కోరికను కోరుకొని తన ఇంటికి వెళ్లిపోతాడు.
ఇక శాంతా ఒకడే తీవ్రంగా ఏదో ఆలోచిస్తుంటాడు. కొద్దిసేపు తరువాత శాంతా తన కోరికను తెలుపుతూ.. ‘‘చూడు బ్రదర్.. వాళ్లిద్దరూ ఇక్కడి నుండి వెళ్లిపోవడం వల్ల నేను ఒంటరివాణ్ణి అయిపోయాను. నువ్వొక పని చేయ్.. వాళ్లిద్దరిని తిరిగి ఇక్కడికి రప్పించు. నాకు తోడుగా వుంటారు’’ అని అంటాడు.
జీనీ మాయ చేసి వాళ్లిద్దరినీ తిరిగి రప్పిస్తాడు. దీంతో వారిద్దరూ కోపంతో... ‘‘నీయబ్బా.. ఇదేం కోరిక కోరుకున్నావ్ రా గాడిదా.. అడ్డగాడిదా... దున్నపోతా.. రేయ్ వెధవా నువ్వు కూడా కోరిక కోరుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు కదరా బుర్ర లేని సన్నాసి.. ఒరేయ్ ఆగురా రేయ్’’ అంటూ అతన్ని తరిమి తరిమి కొడతారు.
ఒక డాక్టర్ తన ఇంటి ద్వారం ముందు ఒక గంట పెట్టుకున్నాడు. అలాగే దానిపైనే ఒక బోర్డ్ పెట్టి వుంది. ఆ బోర్డులో ‘‘డాక్టర్ కోసం గంట కొట్టండి’’ అని రాసి వుంది.
ఒకరోజు అర్థరాత్రి ఫుల్లుగా తాగివున్న ఒక సర్దార్ ఆ డాక్టర్ ఇంటిముందు నుంచి వెళుతున్నాడు. ఆ డాక్టర్ ఇంటిదగ్గరున్న గంటను చూశాను. ఆ బోర్డు మీద రాసున్నది చూసి గంట కొట్టాడు.
కొద్దిసేపటి తరువాత బాగా నిద్రమత్తులో వున్న ఒక వ్యక్తి తన కళ్లను తడుముతూ బయటకు వచ్చాడు. అప్పుడు సర్దార్ డాక్టర్ తో ఇలా అంటాడు.
సర్దార్ : డాక్టర్ అంటే మీరేనా?
డాక్టర్ : అవును!
సర్దార్ : నీ గంట నువ్వే ఎందుకు కొట్టుకోవు?
ఒకరోజు శాంతా, బంతా మోటార్ సైకిల్ లో వెళుతున్నారు.
దారిలో అనుకోకుండా వాళ్లిద్దరికి యాక్సిడెంట్ అయిపోతుంది.
అక్కడున్నవారు వాళ్లిద్దర్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.
డాక్టర్ బంతాకి ట్రీట్ మెంట్ చేస్తూ కాలుకి పట్టి కడుతుండగా... బంతా గట్టిగా అరిచేశాడు.
అతని అరుపు విని ఆసుపత్రిలో వున్న మిగతా పేషెంట్లు కూడా లేచి కూర్చున్నారు.
తరువాత డాక్టర్ శాంతా కాలుకి పట్టి కడుతుండగా అతను ఏమీ అనుకుండా సైలెంట్ గావున్నాడు.
అది చూసిన డాక్టర్ బంతాతో ఈవిధంగా అంటాడు...
డాక్టర్ : చూడు బంతా.. శాంతా ఎంతో బలమైనవాడో. నేను పట్టి కడుతుంటే అస్సలు అరవకుండా ఎంతో ప్రశాంతంగా వున్నాడు చూడు.
అంతలోనే శాంతా కలగజేసుకుని డాక్టర్ తో ఇలా అంటాడు.
శాంతా : లేదు డాక్టర్ గారూ... సహజంగా చెప్పాలంటే నేను బంతా అరిచిన అరుపులకు భయపడి బాగున్న వేరే కాలుకి పట్టీలు కట్టించుకున్నాను.
ఒకరోజు సర్దార్ కార్పెట్ కొనుక్కోవడానికి బజారుకి వెళతాడు. తోడుగా తన మేనల్లుడు పప్పును కూడా తీసుకెళతాడు.
సర్దార్ ఒక దుకాణదారుడి దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు.
సర్దార్ : ‘‘నాకు ఒక మంచి కార్పెట్ కావాలి. డబ్బు ఎంతైనా ఫర్వాలేదు’’
దుకాణదారుడు : ‘‘అలాగే నండి’’
ఇలా అని, దుకాణదారుడు రకరకాల కార్పెట్ లను సర్దార్ కు చూపిస్తాడు.
చివరకు సర్దార్ ఒక మంచి రంగురంగుల కార్పెట్ ను ఎంచుకుంటాడు.
సర్దార్ : ‘‘నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేనిప్పుడే దీనిని తీసుకెళతాను. ఒకవేళ ఇది నా రూమ్ లో సరిపోతే ఫర్వాలేదు. లేకపోతే వెనక్కు తీసుకొచ్చి నీకెచ్చేస్తాను. ఏమంటావ్’’
దుకాణదారుడు ఇతని మాటలు నమ్మి సరే అని అంటాడు. అప్పుడు
దుకాణదారుడు : ‘‘మీరు ఒకవేళ దీనిని వెనక్కు తెచ్చివ్వాలి అనుకుంటే.. రేపు సాయంత్రం వరకు తీసుకుని రండి’’
ఇంతలో సర్దార్ మేనల్లుడు అయిన పప్పుగాడు దుకాణదారుడితో ఇలా అంటాడు.....
పప్పు : ‘‘ఏం ఫర్వాలేదు అంకుల్... మా ఇంట్లో పార్టీ ఈరోజు రాత్రే జరగబోతోంది!’’