ఒక ఫ్రెండ్ తన స్నేహితుడికి ఈ విధంగా మెసేజ్ పంపించాడు....
‘‘ఒక వ్యక్తికి ఆరు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ అతను పెళ్లి చేసుకున్న కొన్నిరోజుల తరువాత ఆ వ్యక్తి భార్య చనిపోతుంది. ఈవిధంగా చేసుకున్న ఆరు పెళ్లిళ్లలో ఆరుమంది భార్యలు చనిపోతారు.
తరువాత అతను ఇంకొక భార్య కోసం వెదుకులాట మొదలుపెట్టాడు. కానీ అతనితో జరిగిన ఆ సంఘటనను చూసి ఎవరూ అతనికి పిల్లనివ్వడానికి ముందుకు రావట్లేదు.
చివరికి ఒక అమ్మాయి ఇతనికి దొరుకుతుంది. ఆ అమ్మాయికి కూడా ఆరు పెళ్లిళ్లు జరిగి వుంటాయి. వాళ్లు కూడా చనిపోయి వుంటారు.
చివరికి వీళ్లిద్దరూ కలుసుకుని పెళ్లి చేసుకుంటారు. వీరి పెళ్లికి విచ్చేసిన వారందరు ‘‘తరువాత వీళ్లిద్దరికి ఏమవుతుందా’’ అనే ఆందోళనలో పడిపోయారు.
వారిద్దరికి పెళ్లయిన మరుసటి రోజే.. మరుసటి రోజే...
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
ముందు నాకు 50 రూపాయల బ్యాలెన్స్ రిచార్జ్ చేయించు. ఆ తరువాత మిగిలిన సస్సెన్స్ స్టోరీ పంపిస్తా’’.