బీమా కంపెనీలకు చెందిన ముగ్గురు సేల్స్ మేన్ వ్యక్తులు.. తమతమ కంపెనీల సేవా కార్యక్రమాల గురించి చర్చించుకుంటుంటారు.
మొదటివాడు : మా కంపెనీ సర్వీస్ ఎంత వేగంగా పనులను నిర్వర్తిస్తుందంటే... ఒక వ్యక్తి సోమవారంనాడు మరణిస్తే.. మా కంపెనీవారు బుధవారం రోజే అతని కుటుంబసభ్యులకు మొత్తం పరిహారాన్ని చెల్లించేసింది.
రెండవవాడు : ఇందులో వేగం ఎక్కడుంది. ఫాస్ట్ గా పనిచేయడంలో మా కంపెనీయే ముందుగా వుంటుంది. మా కంపెనీవారు వ్యక్తి చనిపోయిన సాయంత్రానికే అతని ఇంటికి వెళ్లి.. వారికి చెందాల్సిన మొత్తం పరిహారాన్ని ఇచ్చేసింది.
మూడవవాడు : ఇక చాలించండి మీ కంపెనీల వేగ ప్రతాపాలు! మీరిద్దరూ చెప్పినదాంట్లో అసలు అర్థమే లేదు. ఇటువంటి విషయాలలో మా కంపెనీయే చాలా ఫాస్ట్ గా వుంటుంది. మా ఆఫీస్ వుండేది 10వ అంతస్తులో. అదే బిల్డింగ్ లోని 30వ అంతస్తులో వుండే ఒక వ్యక్తి కిటికీలను శుభ్రం చేస్తుండగా కిందకు పడిపోతుండగా... 10వ అంతస్తులో వున్న మా ఆఫీసు దగ్గరికి చేరుకోగానే అతనికి చెందాల్సిన మొత్తం డబ్బుల చెక్ ను అతని చేతిలో పెట్టేసింది!
బాషా : ఒక సబ్జెక్ట్ చదివితే.. అన్ని సబ్జెక్ట్స్ చదివినట్టే.
నరసింహ : అతిగా చదవని ఆడది.. అతిగా కాపీ కొట్టే మగాడు.. సుఖపడినట్లు చరిత్రలో లేదు.
బాబా : చదివింది గోరంతా.. చదవాల్సింది కొండంతా..
శివాజీ : నాన్నా పందులే ఈకాలంలో చదువుతాయి.. సింహం పరీక్షలరోజు చదువుతుంది.
అరుణాచలం : ఆ లెక్చరర్ బోధిస్తాడు.. ఈ అరుణాచలం విని వదిలేస్తాడు.
ముత్తు : నువ్వు చదవనిది ఎగ్జామ్ లో రాకున్నప్పుడు.. చదివింది ఎంతకీ గుర్తురాదు.
ఒకరోజు రాజు అనే ఒక ఆఫీసు బాసు, రవి అనే తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్లాడు.
రాజు (బాస్) : ఒరేయ్ రవి.. ఈరోజుల్లో కాలం మొత్తం నాకు వ్యతిరేకంగానే నడుస్తోంది రా. నిన్ననే మా ఆఫీస్ లో నా సెక్రటరీ రిసైన్ చేసి వెళ్లిపోయింది.
రవి : కానీ ఎందుకు?
రాజు (బాస్) : ఎందుకంటే.. నేను నా భార్యను ముద్దు పెట్టుకుంటుంటే.. తను చూసింది. అందుకే!
ఒకరోజు భార్యాభర్తల మధ్య తగాధాలు ఏర్పడి విడాకుల కోసం కోర్టుకు వెళతారు.
అక్కడ భార్యభర్తలు, లాయర్, జడ్జి మధ్య కొద్దిసేపు వరకు వాగ్యుద్ధం జరుగుతుంది.
లేడీ : లేదు లాయర్ గారూ... ఎలాగైనా సరే.. నాకు విడాకులు కావాల్సిందే!
లాయర్ : అయినా.. నీ భర్త కబడ్డీ ఛాంపియన్ కదా.. ఏంటి ప్రాబ్లం?
లేడీ : అదే నాకు పెద్ద ప్రాబ్లం అయింది.. నన్ను జస్ట్ టచ్ చేసి పారిపోతాడు.
ఒకరోజు భర్త వేటకు వెళ్లడానికి గన్ తీసుకుని సిద్ధంగా వుంటాడు. అప్పుడు
భర్త : డార్లింగ్ నేను వేటకు వెళుతున్నాను. bye.. bye..
భార్య : త్వరగా వెళ్లి రండి.. నేను మీకోసం భోజనం తయారుచేసి పెడతాను.
అని భార్య భర్తతో అంటూ... కిచెన్ లో నుంచి బయటకు వస్తుంది.
భర్త వెళ్లకుండా డోర్ దగ్గరే నిలబడి వున్నాడు. అప్పుడు
భార్య : నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు. వేటకు వెళతానని చెప్పావుగా..!
భర్త : అవును వేటకు వెళ్లడానికే సిద్ధమయ్యాను. కానీ...!
భార్య : మరి వెళ్లు.. మళ్లీ ఈ కానీ ఏంటి?
భర్త : ఎలా వెళ్లాలి... ఇంటి బయట కుక్క నిలబడి వుంది.
రాముడు : ‘‘నువ్వు నా జేబులో చెయ్యి ఎందుకు పెట్టావ్?’’
లక్ష్మణుడు : ‘‘నాకు అగ్గిపెట్టే అవసరముండేది. అందుకే నీ జేబులో వుంటుందేమోనని చెయ్యి పెట్టాను’’
రాముడు : ‘‘అలా అయితే నన్ను అడగొచ్చు కదా’’
లక్ష్మణుడు : ‘‘నేను అపరిచితులతో మాట్లాడను. అందుకే అడగలేదు’’
ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి చనిపోయిన తరువాత యమధర్మరాజు దగ్గరకు వెళతారు.
యమధర్మరాజు వారు చేసి కర్మల గురించి అడుగుతారు. అప్పుడు వారు సమధానాలు ఈవిధంగా చెబుతారు.
మొదటి అమ్మాయి : నేను పెళ్లికి ముందే నా బాయ్ ఫ్రెండ్ కి ముద్దుచ్చాను.
యముడు : అయితే నువ్వు నరకానికి వెళ్లు.
రెండవ అమ్మాయి : నేను పెళ్లి తరువాత నా భర్తకు ముద్దిచ్చాను.
యముడు : అయితే నువ్వు స్వర్గానికి వెళ్లు.
మూడవ అమ్మాయి : నేను పెళ్లి ముందు ముద్దు ఇవ్వలేదు... పెళ్లి తరువాత కూడా ఇవ్వలేదు.
యముడు : అయితే నువ్వు నా రూమ్ కి వెళ్లు.