భర్త ఆఫీస్ కి వెళ్లిన తర్వాత భార్య ఫోన్ చేసింది.
ఫోన్ రింగ్ అవడాన్ని గమనించిన సెక్రటరీ.. ఫోన్ లిఫ్ట్ చేశాడు.
తన భర్తకు ఫోన్ ఇవ్వాల్సిందిగా ఆ మహిళ చెప్పింది. అప్పుడు
సెక్రటరీ : సార్! మీ ఆవిడ నుంచి ఫోన్ అని అన్నాడు.
బాస్ : రెండు నిముషాలు అలాగే పట్టుకుని నిలబడు.. ఆ తర్వాత ఇవ్వు! అన్నాడు.
సెక్రటరీ : అదేమిటీ సార్? ఎందుకలా? అని ప్రశ్నించాడు.
బాస్ : ప్రారంభంలో రెండు నిముషాలు డిష్యుం-డిష్యుంలుంటాయి. ఆ తర్వాత అసలు సంగతి చెప్పే అలవాటుంది మా ఆవిడకు! అని అన్నాడు.
అది విన్న సెక్రటరీ.. ఒక్కసారిగా నవ్వేశాడు.
ఒకరోజు ఒక ముసలి వ్యక్తి తన ముసలి భార్యకు సరిగ్గా వినిపిస్తోందో లేదోనని తెలుసుకోవడానికి ఆమె దగ్గరకు వెళతాడు.
ముసలి వ్యక్తి : ఇదిగో, నేను చెప్పేది నీకు వినిపిస్తోందా..?
అని చెబుతాడు. కానీ ఎంతసేటపటికీ జవాబు రాకపోవడంతో కొంచెం దగ్గరగా వెళతాడు.
ముసలి వ్యక్తి : ఇదిగో నిన్నే, నేను చెప్పేది నీకు సరిగ్గా వినిపిస్తోందా..? లేదా..?
రెండవసారి కూడా జవాబు రాకపోవడంతో ఆయన ఆమెకు మరింత దగ్గరగా (చెవికి దగ్గరగా) వెళ్లి కూర్చుంటాడు.
ముసలి వ్యక్తి : ఒసేయ్ చెవిటిదానా.. నిన్నేనే.. అప్పటినుంచి అరుస్తున్నాను.. నేను చెప్పేదానికి సమాధానమే చెప్పడం లేదు. అసలు నేను చెప్పేది నీకు వినిపిస్తోందా..? లేదా..?
అని చెబుతాడు. దీంతో ఆమె కోపానికి గురయి గట్టిగా అరుస్తూ తన ముసలి భర్తతో ఇలా అంటుంది...
ముసలి భార్య : నీయబ్బా చెవిటినాకొడకా.. నీకెన్ని సార్లు వినిపిస్తోందని చెప్పాలిరా! మూడవసారి కూడా వినిపిస్తోందని చెబుతున్నాను. ఇంకొకసారి నాకు ఈ ప్రశ్న వేశావంటే.. నీ మూతిపళ్లు రాలగొట్టి, కాళ్లు విరగ్గొడతాను జాగ్రత్త!
ఒక భర్త తన భార్యను చంపినందుకు కోర్టులో కేసు నడుస్తున్న తరుణంలో న్యాయవాది హంతకుడితో (భర్త)తో కొన్ని ప్రశ్నలు వేస్తాడు. అవి..
న్యాయవాది : ఎప్పుడైతే నువ్వు డోర్ తీసి ఇంట్లోకి ప్రవేశించావో అప్పుడు నీ భార్య వేరొక మనిషితో బెడ్ పై పడుకోవడం చూశావు!
హంతకుడు : అవును సార్.. మీరు చెప్పినట్లే అక్కడ అలా జరిగింది.
న్యాయవాది : ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే నువ్వు నీ జేబులో వున్న గన్ బయటకు తీసి నీ భార్యను చంపేశావ్.
హంతకుడు : అవును సార్.. మీరు చెప్పినట్లే అక్కడ జరిగింది.
న్యాయవాది : నేను అడగదలచుకున్నదేమిటంటే.. నువ్వు నీ భార్యనే ఎందుకు చంపావ్? ఆమె ప్రియుడిని ఎందుకు చంపలేదు?
హంతకుడు : ఇందులో చెప్పాల్సింది ఏముంది సార్... ఒక్కొక్క మనిషిని చంపుకుంటూ వెళ్లలేము కదా!
ఒకరోజు కొత్తగా పెళ్లయిన ఒక భార్య తన భర్త ఇంటికి రాగానే ఇలా అంటుంది.
భార్య : నా దగ్గర నీకోసం ఒక మంచి వార్త వుంది. చాలా త్వరలోనే మనం ఇద్దరం నుంచి ముగ్గురు కాబోతున్నాము.
ఈ మాట వినగానే భర్త ఎంతో సంతోషంగా భార్యతో ఇలా అంటాడు.
భర్త : అరె నా ప్రియమైన భార్య.. ఇప్పుడు నేను ఈ ప్రపంచంలోనే అందరికంటే అదృష్టవంతుణ్ణి!
భార్య : మీరు ఈ విధంగా సంతోష పడతారని నేను అనుకోలేదు. నాక్కూడా చాలా ఆనందంగా వుంది. రేపు ఉదయాన్నే మా అమ్మగారు మనతో వుండడానికి ఇక్కడికి వస్తున్నారు!
ఈ మాట వినగానే భర్తకు కళ్లు బైర్లుకమ్మి, కోమాలోకి వెళ్లిపోతాడు.
ఒకరోజు ఒక భర్త భయపడుతూ తన ఇంటికి చేరుకుంటాడు.
తన భార్యను పలిచి.. ‘‘డార్లింగ్.. నేను ఈరోజు ఆఫీస్ నుంచి వస్తుండగా దారిలో ఒక గాడిదా...!
అని అంటుండగానే అతని చిన్న కూతురు అరుస్తూ లేచి, ఇలా అంటుంది.. ‘‘మమ్మీ .. రీటా నా బొమ్మను విరగగొట్టింది’’!
తరువాత భర్త తన మాటలను మొదలుపెట్టి ఇలా అంటాడు.. ‘‘ఆ.. నేనొక్కడున్నాను.. గుర్తొచ్చింది నేను వస్తుండగా దారిలో ఒఖ గాడిదా..!
ఇంతలోనే వాళ్ల చిన్నకొడుకు కూడా గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు.. ‘‘మమ్మీ, రీటా నా కార్ ను విరగగొట్టింది’’!
దీంతో భార్య కూడా వేదనతో.. ‘‘దేవునికోసం మీరిద్దరూ నోరు మూసుకుని వుండండి.. ముందు నాకు ఈ గాడిద మాటను విననివ్వండి’’!
ఒకరోజు రాత్రి ఒక ట్రాఫిక్ పోలీసు అధికారి ఒక కారును ఆపుతాడు.
అందులో కారు నడుపుతున్నవాడిని ఆ అధికారి ఇలా అడిగాడు... ‘‘మీరు మీ కార్ ముందు వున్న లైట్లను ఎందుకు వెలిగించలేదు?’’
కారులో వున్న వ్యక్తి : అదేమిటంటే సార్... ఇప్పుడిప్పుడే బండికి యాక్సిడెంట్ అయింది. దాంతో లైట్లు పగిలిపోయాయి.
పోలీస్ అధికారి : సరే.. నీ లైసెన్స్ ఎక్కడుంది.
కారులో వున్న వ్యక్తి : అదింకా చేయించుకోలేదు. ఇప్పుడే వెళ్లి చేయించుకుంటాను.
పోలీస్ అధికారి : అలా అయితే.. ఒకేసారి చేసిన రెండు తప్పులకు నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను.
అప్పుడే ఆ కారు వెనుక సీటులోంచి ఆ వ్యక్తి భార్య గొంతు వినిపిస్తుంది.
భార్య : వుండండి పోలీస్ గారు! ఈయన చెప్పిన మాటలను మీరు నమ్మకండి. ఎక్కువగా తాగినప్పుడే ఇటువంటి మాటలు మాట్లాడుతారు.
ఇద్దరు ప్రేమికులు ఒక పార్కులో కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు.
ప్రేమికుడు : నిన్న రాత్రి నాకు ఒక అందమైన కల వచ్చింది.
ప్రేమికురాలు : అవునా... ఇంతకీ ఆ కలలో ఏమైంది?
ప్రేమికుడు : కలలో నాకు ఒక అందమైన, తెలివైన అమ్మాయితో పెళ్లయిపోయింది.
ప్రేమికురాలు : అలా అయితే నేను గుడికి వెళ్లి ప్రసాదం ఇవ్వాలి.
ప్రేమికుడు : కానీ నాకు పెళ్లి వేరే అమ్మాయితో అయింది. నువ్వెందుకు ప్రసాదం ఇస్తావు?
ప్రేమికురాలు : నీతో నాకు విముక్తి కలిగితే గుడిలో ప్రసాదం ఇస్తానని దేవుడికి మొక్కుకున్నాను. అందుకే..!
ప్రియురాలు రాక్స్... ప్రేమికులు షాక్!