పేదవాళ్ళం అవడం చేత 16 ఏళ్ళ వయస్సున్నప్పుడు మా చిన్న కూతురిని ఒక ఉన్నత కుటుంబంలో... పెద్ద చదువులు చదివిన ఆమె దగ్గర పనిమనిషిగా నియమించాం. 6 నెలల వరకు బాగానే ఉంది. ఆ తరువాత ఆమె నా కూతుర్ని నానా రకాలుగా చిత్రహింసలు చేయడం, కొట్టడం, అదేవిధంగా తెల్ల కాగితం మీద సంతకం చేయించుకొని... ‘నువ్వు నా దగ్గర 2 లక్షల రూపాయల అప్పు చేశావు. కావున అప్పు తీర్చి వెళ్ళమని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తోంది. అంతే కాకుండా ప్రతి రోజూ కొడుతూ... ఒక్క పూట భోజనం పెట్టి 20 గంటలు పని చేయిస్తూ... గ్యాస్ లైటర్ తో ఒళ్లంతా వాతలు పెట్టింది. నా కూతురు చావుబతుకుల మధ్య ఉండగా నన్ను పిలిచి ఇక్కడ జరిగిన విషయం బయట చెప్పినచో... నువ్వు నా దగ్గర అప్పు చేసినట్టుగా కేసు పెట్టి వసూలు చేస్తాను అని బయటపెట్టి నా కూతురును నా ఇంటికి పంపించారు. వెంటనే నేను పక్కవాళ్ళ సహాయం తీసుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకోలేదు. ఒక వారం రోజుల లోపే నా కూతురు చనిపోయింది. దీనికి మీ నుండి ఎలాంటి న్యాయం జరుగుతుంది. డబ్బు ఉన్న పెద్ద మనుషులకు శిక్ష పడు విధానాలు చెప్పగలరు ?
న్యాయం అనేది పేద, ధనవంతుల్లో ఏ ఒక్కరికీ చెందినది కాదు. చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. కానీ ఈ మధ్యలో కొంత మంది లంచాలకు అలవాటు పడి న్యాయాన్ని అన్యాయంగా మార్చుతూ మీలాంటి వారికి ప్రాణం పోయినా పట్టించుకోవడం లేదు. కావున ఇలాంటి విషయాల్లో మీరు గట్టిగా పోరాటం చేసినచో మీకు తప్పక న్యాయం జరుగుతుంది. మీ విషయంలో ఆ ఇంటి యాజమానురాలు రెండు తప్పులు చేసింది. ఒకటి మైనర్ బాలికను పనిలో తీసుకోవడం, రెండవది... చిత్రహింసలకు గురి చేయడం, ఆ చిత్ర హింసలతో చనిపోవడం దీనినే మర్డర్ లేదా హత్య అని అంటారు. తెల్ల కాగితం పై సంతకాలు తీసుకోవడం, దీనిని బ్లాక్ మెయిల్ అంటారు. ఈ విధంగా మీరు వెంటనే సంబంధిత పీఎస్ లో న్యాయం జరుగనిచో పై అధికారికి ఫిర్యాదు చేయండి. వేధింపులు చేసిన ఆమెకు కోర్టు కనీసం 6 లేక 7 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు లక్ష నుండి 5 లక్షల వరకు నష్టపరిహారం విధిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Mar 16 | తన భర్తకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని.. అతడి మరణం తరువాత తమ కుటుంబంలోని వ్యక్తులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. కుటుంబం అంటే కేవలం భర్త తరపు వారు మాత్రమే కాదని..... Read more
Nov 30 | మీ త్లలిదండ్రుల ఇంట్లోంచి మిమ్మల్ని వెళ్లిపోమని అన్నారంటే అందుకు గల కారణాలను తెలిపాలి. మంచి పనులు చేస్తే వెళ్లిమన్నారా..? లేక దేని గురించి వెళ్లిపోమన్నారన్నది మీరు తెలియజేయలేదు. ఇక మంచి పనులతో ఇబ్బందులు వస్తాయని... Read more
Oct 03 | నేను ముస్లిం.. నాకు బాల్యవివాహాల చట్టం వర్తిస్తుందా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మద్రాసు కోర్టు తరువాత గుజరాత్ హైకోర్టు కూడా బాల్య వివాహ నిరోధక చట్టంపై స్పష్టమైన అదేశాలను జారీ చేసింది. ఈ... Read more
Jul 15 | నాకు డయాబిటిస్ వుంది..? నాకు వారసత్వంగా షుగర్ వ్యాధి సంక్రమించింది. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా..? అన్న ప్రశ్న సాధరణంగా చాలా మందిలో తలెత్తుతుంది. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు వెల్లడించిన తీర్పు... Read more
Jul 02 | నేను నా భర్తకు రెండో భార్యను, ఆయన మొదటి భార్య 2005లోనే కన్నమూసింది. ఆయన కూడా 2011లో మరణించారు. ఈ నేపథ్యంలో నాకు నా భర్త పించను లభిస్తుందా..? అన్న సందేహాలు చాలా మంది... Read more