కారుణ్య నియామకాలకు వివాహితులైన కూతురు పనికిరాదా అన్నది పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వ అధికారుల నుంచి మాత్రం వారు అర్హులు కారేనే సమాధానమే వస్తుంది. కారుణ్య నియామాకాలకు వివాహమైన అబ్బాయిలు అర్హులైనప్పడు.. తామెందుకు కాము అన్న ప్రశ్న వారిలో ఉత్పన్నమవుతోంది. ఆడవారికి, మగవారికి మధ్య ఇంతటి వివక్ష ఎందుకని చెన్నైకి చెందిన రేణుకలో రేగిన సందేహమే.. ఆడవారికి ఇకపై వరంలా మారనుంది. బతులకు బండి లాగేందుకు మార్గాన్ని చూపనుంది.
పీఆర్ రేణుక ఎవరీవిడ అనుకుంటున్నారా..? ఈమె కూడా ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురు. అమె తండ్రి తమిళనాడు పశుసంవర్ధకశాఖలో కార్యాలయ సహాయకుడిగా పనిచేస్తూ 1998లో మరణించారు. అప్పటికే ఆమె పెళ్త్లె, భర్త నుంచి విడాకులు పొంది తండ్రి వద్ద నివసిస్తున్నారు. తండ్రి మరణంతో కారుణ్య నియామకం కింద తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే సంతానంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తుంటారు. భర్త నుంచి విడిపోయినట్లు విడాకుల మంజూరు పత్రాలను కూడా పొందుపరిచారు. అయితే ఆమెకు వివాహమైంది కాబట్టి కారుణ్య నియామకానికి అర్హురాలు కాదంటూ అధికారులు అభ్యర్థనను తిరస్కరించారు. దాంతో ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
రేణుక వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మరణించిన ఉద్యోగి కుమార్తెకు వివాహమైందనే కారణంతో ఆమె కారుణ్య నియామకానికి అనర్హురాలనే వాదనను న్యాయస్థానం తప్పుపట్టింది. 'పెళ్లి అయిన కుమారుడు కారుణ్య నియామకానికి అర్హుడవొచ్చు కానీ, పెళ్లయిన కుమార్తె మాత్రం అర్హురాలు కాదా, ఏమిటీ వివక్ష?' అంటూ ధర్మాసనం ఘాటుగా ప్రశ్నించింది. కేసు విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.హరిపరంధామన్ అధికారుల తీరును తప్పుబట్టారు. పెళ్త్లెన కుమార్తె, కొడుకూ ఇదరూ సమానమేనని, కుమార్తెకు పెళ్లయిందని వివక్ష చూపడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని న్యాయమూర్తి అన్నారు. పిటిషనర్‌కు ఉద్యోగం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఇక మీదట కారుణ్య నియామకాలకు వివాహితురాలైన కూతుళ్లు కూడా అర్హులే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 16 | తన భర్తకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని.. అతడి మరణం తరువాత తమ కుటుంబంలోని వ్యక్తులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. కుటుంబం అంటే కేవలం భర్త తరపు వారు మాత్రమే కాదని..... Read more
Nov 30 | మీ త్లలిదండ్రుల ఇంట్లోంచి మిమ్మల్ని వెళ్లిపోమని అన్నారంటే అందుకు గల కారణాలను తెలిపాలి. మంచి పనులు చేస్తే వెళ్లిమన్నారా..? లేక దేని గురించి వెళ్లిపోమన్నారన్నది మీరు తెలియజేయలేదు. ఇక మంచి పనులతో ఇబ్బందులు వస్తాయని... Read more
Oct 03 | నేను ముస్లిం.. నాకు బాల్యవివాహాల చట్టం వర్తిస్తుందా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మద్రాసు కోర్టు తరువాత గుజరాత్ హైకోర్టు కూడా బాల్య వివాహ నిరోధక చట్టంపై స్పష్టమైన అదేశాలను జారీ చేసింది. ఈ... Read more
Jul 15 | నాకు డయాబిటిస్ వుంది..? నాకు వారసత్వంగా షుగర్ వ్యాధి సంక్రమించింది. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా..? అన్న ప్రశ్న సాధరణంగా చాలా మందిలో తలెత్తుతుంది. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు వెల్లడించిన తీర్పు... Read more
Jul 02 | నేను నా భర్తకు రెండో భార్యను, ఆయన మొదటి భార్య 2005లోనే కన్నమూసింది. ఆయన కూడా 2011లో మరణించారు. ఈ నేపథ్యంలో నాకు నా భర్త పించను లభిస్తుందా..? అన్న సందేహాలు చాలా మంది... Read more