స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగులకు చెందిన భూములను కొనుగోలు చేయవచ్చా..? అన్న దర్మసందేశం ప్రతీ ఒక్కరిలోనూ కలుగుతుంది. అయితే నిజానికి వారి సేవలకు మెచ్చి ప్రభుత్వం ఇచ్చిన భూములపై వారికి అనుభవించే హక్కు మాత్రమే ఉంటుందని, దానిని విక్రయించే అధికారం వుండదని కూడా చాలా మంది అంటుంటారు. ఇందులో ఏది నిజం..? నిజంగా వారికిచ్చిన భూములు కొనచ్చా..? లేదా..? అన్న ప్రశ్నలు తలెత్తుతుంది. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగులకు చెందిన భూములను నిరభ్యంతరంగా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే అంతకు ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది.
మొదటగా వారికి ప్రభుత్వం భూములు ఇచ్చి సుమారు 10 సంవత్సరాలు దాటి వుండాలి. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వం పదేళ్ల కిందట మంజూరు చేసిన భూములను ఎవరైనా కోనుగోలు చేసుకోవచ్చు. వారు భూములు తీసుకుని పదేళ్లు కాని పక్షంలో వాటిని కొనుగోలు చేయరాదు. ఒక వేళ కొనుగోలు చేసినా.. సదరు భూమికి మీరు యజమాని కారు. తప్పనిసరిగా పదేళ్ల తరువాత మాత్రమే వాటిని విక్రయించే అవకాశం వారికి, కొనుగోలు చేసే అధికారం మీకు వుంటుంది.
ఇక్కడ మరో విషయాన్ని కూడా క్షుణంగా పరిశీలించాలి. భూములను విక్రయించే స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగులు జిల్లా కలెక్టర్ దృష్టికి తమ భూములను అమ్మదలచుకున్నట్లు తీసుకెళ్లాలి. భూమిని అమ్ముకోవడానికి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం కావాలంటూ దరఖాస్తు చేసుకోవాలి. దానిని కలెక్టర్ క్షుణ్నంగా పరిశీలించాక నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) జారీ చేస్తారు. అది వచ్చాకే సంబంధిత భూమిని విక్రయించాల్సి ఉంటుంది. ఈ నిబంధన పెట్టడానికో కారణముంది. గత కొంతకాలం నుంచి స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగులకు సంబంధించి బోగస్ సర్టిఫికెట్లను సృష్టించి.. అక్రమ పద్ధతుల్లో భూములను విక్రయించిన సంఘటనలు అనేకం రావడంతోనే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది.
కలెక్టర్ జారీ చేసిన ఎన్వోసీ సర్టిఫికెట్‌ను రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కమిషనర్‌కు పంపిస్తారు. అక్కడ్నుంచి సంబంధిత సబ్‌రిజిస్ట్రార్ వద్దకు వెళ్లాకే.. ఆయా ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలవుతుంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లడం కంటే ముందు స్థానిక తహసీల్దారు ఆఫీసుకు వెళ్లి.. మనం కొనాలనుకున్న భూమికి సంబంధించిన అసలైన యజమాని.. మనకు భూమిని అమ్ముతున్న వ్యక్తి ఒక్కరేనా అని కనుక్కోవాలి. ఇలా చేస్తే ఏక్కడా ఏ ఇబ్బందులు వుండవు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 16 | తన భర్తకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని.. అతడి మరణం తరువాత తమ కుటుంబంలోని వ్యక్తులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. కుటుంబం అంటే కేవలం భర్త తరపు వారు మాత్రమే కాదని..... Read more
Nov 30 | మీ త్లలిదండ్రుల ఇంట్లోంచి మిమ్మల్ని వెళ్లిపోమని అన్నారంటే అందుకు గల కారణాలను తెలిపాలి. మంచి పనులు చేస్తే వెళ్లిమన్నారా..? లేక దేని గురించి వెళ్లిపోమన్నారన్నది మీరు తెలియజేయలేదు. ఇక మంచి పనులతో ఇబ్బందులు వస్తాయని... Read more
Oct 03 | నేను ముస్లిం.. నాకు బాల్యవివాహాల చట్టం వర్తిస్తుందా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మద్రాసు కోర్టు తరువాత గుజరాత్ హైకోర్టు కూడా బాల్య వివాహ నిరోధక చట్టంపై స్పష్టమైన అదేశాలను జారీ చేసింది. ఈ... Read more
Jul 15 | నాకు డయాబిటిస్ వుంది..? నాకు వారసత్వంగా షుగర్ వ్యాధి సంక్రమించింది. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా..? అన్న ప్రశ్న సాధరణంగా చాలా మందిలో తలెత్తుతుంది. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు వెల్లడించిన తీర్పు... Read more
Jul 02 | నేను నా భర్తకు రెండో భార్యను, ఆయన మొదటి భార్య 2005లోనే కన్నమూసింది. ఆయన కూడా 2011లో మరణించారు. ఈ నేపథ్యంలో నాకు నా భర్త పించను లభిస్తుందా..? అన్న సందేహాలు చాలా మంది... Read more