బారెన్ ద్వీపాలు
బారెన్ ద్వీపాలు, అండమాన్ దీవులు అండమాన్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ కు 84 మైళ్ళ దూరంలో బారెన్ దీవి కలదు. మనిషి పర్యటనలకై చేసే అంతులేని ప్రయత్నాలే బారెన్ దీవిని ఒక అద్భుత పర్యాటక ప్రదేశంగా కనుగొన్నాయి. పేరుకు తగినట్లుగానే ఈ దీవి నిర్మానుష్యంగా ఉంటుంది. కొన్ని రకాల వన్య జీవులు మాత్రం సంచరిస్తూంటాయి. బారెన్ లో అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తుంటాయి కనుక ఇక్కడికి రావటానికి పర్యాటకులు, సాహసికులు ధైర్యం చేయరు.