హిందువులు జరుపుకునే సమస్త పండుగలలో శ్రీరామనవమి ఎంతో ముఖ్యమైంది. శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినం, కళ్యాణం రెండూ ఒకే రోజున కావడం వల్ల దీనిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
శ్రీ మహావిష్ణువుకు ఏడవ అవతారమయిన శ్రీరాముడు పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో, మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు. దీనిని అభిజీత్ ముహూర్తం అని అంటారు. జ్యోతిష్య పండితులు తమ పరిశోధనల ద్వారా శ్రీరాముడు క్రీ.పూ.5114, జనవరి 10వ తేదీన జన్మించి వుండవచ్చని అంచనా వేస్తున్నారు.
కథ :
దశరథ మహారాజు, అతని భార్యలలో ఒకరైన కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. అయితే భరతుడిని పట్టాభిషేకం జరిపించాలని దశరథుని మరోభార్య అయిన కైకేయి శ్రీరాముడిని రాజ్యం నుంచి బహిష్కరించాలని తలచుకుంటుంది. అప్పుడు ఆమె తన 14 సంవత్సరాలవరకు రాముడిని అడవులకు పంపమని దశరథునితో కోరుకుంటుంది.
ఇది తెలుసుకున్న రాముడు.. తన తండ్రి ఆజ్ఞను పాటించి అరణ్యవాసం చేయడానికి బయలుదేరుతాడు. అతనితోపాటు లక్ష్మణుడు, సీతమ్మ కూడా వెళతారు. రామబంటు అయిన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడికి తోడుగా వున్నాడు.
ఆ తరువాత రావణుడు సీతను తీసుకెళ్లడం... రాముడు హనుమంతుడు, సుగ్రీవుని సహాయంతో రావణుడిని హతమార్చి సీతను తిరిగి పొందడం జరుగుతుంది. తరువాత రాముడు పట్టాభిషిక్తుడై తన రాజ్యాన్ని పరిపాలించుకుంటాడు.
తండ్రి ఆజ్ఞను ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా పరిపాలించిన ఏకైక పత్నీవ్రతుడు అయిన శ్రీరాముడిని ఎంత కీర్తించినా తక్కువే. రామాయణాన్ని తరుచూ పారాయణం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతుంటారు.
''శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నమ తత్తుల్యం రామ నామ వరాననో''
అనే పవిత్ర మంత్రాన్ని పూజా సమయంలో తొమ్మిదిసార్లు స్మరించుకోవడం వల్ల ఎలాంటి కష్టనష్టాలూ ఉండవని, సకల సంపదలూ కలుగుతాయని పెద్దలు విశ్వసిస్తారు.
కొందరు శ్రీరామనవమిని దసరా నవరాత్రులలాగా తొమ్మిదిరోజులపాటు పండుగ చేస్తారు. కొందరు చైత్ర శుక్లపక్ష నవమినాడు మాత్రమే ఈ పండుగను చేసుకుంటారు.
ఈ పండుగను పురస్కరించుకుని అనేక ప్రాంతాల్లో హోలీని తలపించే వసంతోత్సవం జరుపుకుంటారు. శ్రీరామనవమి పర్వదినాలలో రథయాత్ర నిర్వహిస్తారు.
రామభక్తులు ఈ పండుగరోజు ఉపవాసం వుంటారు. ఉపవాసం లేనివారు పానకం, పండ్లు సేవిస్తారు.
శ్రీరామనవమి రోజున రామునికి సంబంధించిన ఆలయాలలో భక్తులు చాలామంది తమ పూజాకార్యక్రమాలను నిర్వహించుకుంటారు. శ్రీరాముడు మధ్యాహ్నం పుట్టాడు కాబట్టి కళ్యాణం కూడా అదే సమయంలో చేస్తారు.
బెల్లం, మిరియాలపొడి, నీళ్ళలో కలిపి తయారుచేసిన పానకం, పెసరపప్పు నానబెట్టి చేసిన వడపప్పు , బియ్యప్పిండిలో బెల్లం, నీళ్ళు కలిపి చేసిన చలిమిడి రామ నవమి ప్రసాదాలు. శాస్త్రీయంగా చూస్తే ఇవన్నీ చలవ చేసే పదార్థాలు. ఈ పండుగ వచ్చేది ఎండాకాలం కనుక వీటిని సేవిస్తే మంచిదనే ఉద్దేశంతో ప్రసాదంగా రూపొందించారు.
కొన్ని ఆలయాలలో సీతారాముల విగ్రహాలను కనులపండగ్గా జరుపుకుంటారు. . శ్రీరాముని భక్తిగీతాలు, భజనలతో ఆలయాలు దివ్యత్వాన్ని సంతరించుకుంటాయి.
(And get your daily news straight to your inbox)
Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more
Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more
Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more
Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more
Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more