దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో జరుపుకున్నప్పటికీ సందడి మాత్రం ఒకేలా ఉంటుంది. మైసూరు, కలకత్తా, ఒడిషా, తెలంగాణా, విజయవాడలలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపు కుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు.
రాముడు రావణుడి ఫై విజయం సాదించి దుష్ట సంహారం చేసి, సీతమ్మను తిరిగి అయోధ్యకు తీసుకువచ్చిన వచ్చిన సందర్బానికి గుర్తుగా ఉత్తరాది ప్రజలు రావణుడి బొమ్మను కూడా దగ్దం చేసి ఈ పండుగను జరుపుకొంటారు.
పాండవులు 12ఏళ్ళు వనవాసం, 1 ఏడు అఙ్ఞాతవాస కాలం లో తమ ఆయుధాలను జమ్మి వృక్షం ఫై వుంచి,తిరిగి అఙ్ఞాతవాసం తర్వాత జమ్మి వృక్షమునకు పూజ చేసి ఆయుధాలను ధరించారు.కాబట్టి చాలా ప్రాంతాలలో ఈ రోజున ఆయుధపూజ ని చేస్తారు. కొన్ని ప్రాంతాలలో జమ్మి ఆకులను కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొంటారు. విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది.
కృతయుగమున సుకేతనుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై భార్యతోకూడ అడవులు తిరుగుచు కష్టాలను అనుభవించుచుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజావిధులను ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరల తన ఐశ్వర్యమును పొందెనని ఐతిహాసిక కథ ఉంది. ఈ కథను బట్టి ప్రజలు దుర్గ లక్ష్మి సరస్వతి వీరిలో ఒక్కొక్కదేవిని మూడేసి దినములు పూజింతురు. ఈ తొమ్మిది రాత్రులయందును ఆ దేవతలను పూజించుటకు వీలుకానిచో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవీత్రయమును కల్పవిధిప్రకారము పూజింతురు. అట్లు పూజించుటచే ఆ దినము మహానవమి అనియు సరస్వతీదేవిని పూజించుటచే సరస్వతి పూజాదినము అని, ఆయుధములను పెట్టి పూజంచుటచే ఆయుధపూజాదినము అనియు చెప్పబడును. మఱునాటి దశమి తిథికి విజయదశమి అని పేరు.
నవరాత్రి ఉత్సవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు ఇలా ఒక్కోప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవరోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలో పార్వతీ దేవిని కనక దుర్గగా, మహా లక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు.
మన దగ్గర ఆచరణలో ఉన్నది...
జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారంట. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు.
ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియబడింది.
తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.
శరన్నవరాత్రులు:
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం లో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరం లో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలం తో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమ లో ఉంటుంది.
కనకదుర్గమ్మ గుడి గురించి...
కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపసు ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఉంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపసు చేసి శువుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయ్యింది.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్నది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కెన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.
ఎన్ని కథలున్నా కనకదుర్గగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దేవికి శరన్నవరాత్రుల పేరిట దసరా తొమ్మిది రోజులు ఉత్సవములు నిర్వహించడము అనాదిగా వస్తున్న ఆచారము. ఈ తొమ్మిది రోజులు దేవి ఒక్కో అలంకారముతో భక్తులకు దర్శనమిస్తింది.
మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి(ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి)
రెండవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
మూడవ రోజు: శ్రీ గాయత్రీ దేవి (విదియ-వృద్ధి )
నాలుగవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి
ఐదవ రోజు: కాత్యాయని దేవి
ఆరవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
ఏడవ రోజు: శ్రీ మహాలక్ష్మి దేవి
ఎనిమిదవ రోజు: శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం)
తొమ్మిదవ రోజు : శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి )
పదవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి )
పదకొండవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )
శరన్నవరాత్రులు మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. దేవి అంటే త్రిమూర్తుల తేజం కలగలిసిన మహాశక్తి. విజయవాడ కనకదుర్గ అలంకారాలే రాష్ట్రములోని మిగతా ప్రాంతాలలో కూడా అనుసరిస్తారు.
శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
శరన్నవరాత్రులలోని మొదటి రోజు దేవిని పసుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. నవరాత్రి అలంకారాలలో తొలి రోజునే కనకదుర్గా దేవిని దర్శించుకున్నవారికి దారిద్ర్య బాధలు మటుమాయము అవుతాయని భక్తుల నమ్మకము.శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.
అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
శ్రీ దుర్గాష్టకమ్
ఉద్వపయతునశ్శాక్తి మాదిశక్తే ద్దరస్మితమ్
తత్త్వం యస్యమహత్సూక్ష్మం మానన్దోవేతి సంశయః
ఙ్ఞాతుర్ఞానం స్వరూపం స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ వైశిష్ట్యమనవస్ధీతిః
దుర్గే భర్గ సంసర్గే సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే నిత్యానందపదేశివా
శివా భవాని రుద్రాణి జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ పాహిమాం పాహిమాం శివా
దృశ్యతేవిషయాకారా గేహణే స్మరణే చధీః
ప్రఙ్ఞావిషయ తాదాత్మ్య మేవం సాక్షాత్ ప్రదృశ్యతే
పరిణామో యథా స్వప్నః సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా త్తథేశ్వర మహాచితః
వికృతి స్సర్వ భూతాని ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా త్రిపాదీణీయతేపరా
భూతానామాత్మనస్సర్గే సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా సఙ్కల్పానారా యథామతిః
ఫలశృతిః
యశ్చాష్టక మిదం పుణ్యం పాత్రరుథాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా సర్వాన్కామానవాప్నుయాత్
(And get your daily news straight to your inbox)
Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more
Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more
Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more
Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more
Sep 13 | ఇస్లాం జరుపుకునే పండుగల్లో ఒకటి బక్రీద్. దీనికి ఈద్ అల్-అజ్ హా, ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ అని కూడా పేర్కొంటారు. త్యాగానికి ప్రతీకగా వ్యవహారించబడే ఈ పండగను... Read more