పూర్వం ఒకనాడు ధర్మరాజు తన తమ్ముడైన అర్జునునితో... ‘‘దేవేంద్రుని దగ్గరున్న దివ్య వస్త్రాలను తీసుకుని రా’’ అని చెబుతాడు. అన్న ఆజ్ఞను శిరసావహించి అర్జునుడి బయలుదేరి ఇంద్రలోకానికి చేరుతాడు. అయితే వాటిని పొందడం కోసం ముందుగా పరమశివునిని ప్రసన్నం చేసుకోమని ఇంద్రుడు, అర్జునునితో అంటాడు. దాంతో అతను శివుని కోసం ధ్యానం చేయడం మొదలుపెడతాడు. అయితే శివుడు అతనిని వెంటనే కరుణించకుండా... ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటాడు.
అర్జునునికి పరీక్ష పెట్టిన శివుడు :
అర్జునుడు ధ్యానం చేస్తుండగానే... అతను కూర్చున్న ప్రదేశంలో మూకాసురునుని సూకర (పంది) రూపంలో వెళ్లమని ఆదేశించాడు. శివుని ఆజ్ఞమేరకు మూకాసురుడు పందిరూపంలో అర్జునుడు ధ్యానం చేస్తున్న ప్రదేశానికి చేరుకుంటాడు. అదే సమయంలో మహాశివుడు కూడా ఆ పందిని వేటాడే వేషంలో కిరాతకుడిగా మారిపోతాడు. అప్పుడు శివుని త్రిశూలం విల్లంబుగా, నెలవంక నెమలి ఈకగా, రుద్రాక్షమాల పూసలదండగా మారిపోతాయి. పార్వతీదేవి కూడా కిరాతకుని భార్యగా అవతరించి, శివుని వెంటే బయలుదేరుతుంది.
భక్తిశ్రద్ధలతో తపస్సు చేసుకుంటున్న అర్జునునికి... పంది అటుఇటుగా తిరుగుతున్న శబ్దం తపోభంగం గావిస్తుంది. దాంతో అతను విసిగిపోయి వెంటనే పందివైపుగా బాణాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలోనే పందిని వెంటాడుతూ కిరాతకుని రూపంలో వచ్చిన శివుడు కూడా దానిపై బాణాలు వేశాడు. అటు అర్జునుడు, ఇటు కిరాతకుడు ఇద్దరూ కలిసి ఒకేసారి బాణాలు ప్రయోగించడంతో ఆ సూకరం ప్రాణాలను కోల్పోతుంది. అప్పుడే వారిద్దరి మధ్య వాగ్యుద్ధం మొదలవుతుంది.
పందిని నేను చంపానంటూ శివుడు అంటే.. లేదు నేనే చంపాను అంటూ అర్జునుడు వాగ్యుద్ధానికి దిగుతాడు. ఇలా కొనసాగిన కొద్దిసేపటి తరువాత ఇద్దరి మధ్య జరుగుతున్న వాగులాట కాస్త ఘర్షణగా మారిపోతుంది. అప్పుడు అర్జునుడు... ‘‘నేను విలువిద్యలో సాటిలేని వాడిని. నన్ను ఓడించినవాడు ఇంతవరకూ ఎవరూ పుట్టలేదు. నేను ఉపయోగించిన బాణంతోనే ఈ సూకరం మరిణించింది అని అంటాడు. అదేవిధంగా కిరాతకుడు కూడా... ‘‘జంతువులను వేటాడటం మా వృత్తి. మేము ప్రయోగించిన బాణంతో ఏ జంతువు కూడా తప్పించుకోలేదు. అది నా బాణానికే ప్రాణాలను కోల్పోయింది’’ అని సమాధానమిస్తాడు.
కిరాతకుని మాటలు విన్న అర్జునుడు ఒక్కసారిగా రగిలిపోతూ శర పరంపర కురిపించాడు. కానీ ఆ బాణాలు కిరాతకుని రూపంలో వున్న శివునిని ఏమీ చేయలేకపోయాయి. శివుడు కూడా అర్జునుని మీద ఒకే ఒక్క బాణం వదులుతాడు. దాంతో అర్జునుడు కిందపడిపోతాడు. దాంతో అతను ఓటిమిని అంగీకరించకుండా కోపంతో తన శక్తినంతటిని ఉపయోగించి, విల్లును సంధిస్తాడు. దాంతో ఒక్కసారిగా మూల్లోకాలన్నీ కంపించాయి. నాలుగువైపులా ఘోర గాలులు వీస్తూ, భూ ప్రపంచం అంతా వినాశనం అవుతున్నట్టు కనిపించింది.
అప్పుడు అర్జునుడు జ్ఞానోదయం కలుగుతుంది. తన ముందున్నది కిరాతక దంపతులు కాదనీ.. ఆ రూపంలో వున్నది శివపార్వతులేనని గ్రహిస్తాడు. వెంటనే తన తప్పును తెలుసుకుని పశ్చాత్తపంతో క్షమించమని వాళ్లిద్దరి కాళ్లమీద పడతాడు. శివుడు చిరునవ్వుతో ఆశీర్వదించి, పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి అదృశ్యమవుతాడు. ఇలా ఈ విధంగా అర్జునుని అనుగ్రహించేందుకు ఒక పరీక్షను పెట్టి, కిరాతకుని రూపాన్ని ధరించాడు.
(And get your daily news straight to your inbox)
Nov 18 | పూర్వం భక్తులు తమతమ ఇష్టదైవాలను ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే.. సాక్షాత్తూ దేవుళ్ళే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోర్కెల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వరుడు మెప్పించిన అపరభక్తుడు బావాజీ.. ఆయనతో కలిసి... Read more
Nov 06 | పూర్వం.. చ్యవనుడు అనే మహర్షికి సుకన్య అనే రాజకుమార్తెతో వివాహం అయ్యింది. చ్యవనుడు అంధుడు మాత్రమే కాకుండా చాలా ముసలివాడు అయినప్పటికీ.. కుందనపుబొమ్మలా వుండే సుకన్య తన యవ్వనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పతివ్రతా నియమంతో... Read more
Nov 02 | స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రునికి అహంకారం ఎక్కువ. భువిపై వున్న మానవులందరూ తన దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉన్నారనీ, తనని భయభక్తులతో కొలిస్తే కానీ వారికి మనుగడ వుండదని విర్రవీగుతుంటాడు. అయితే.. కృష్ణుడు అతని... Read more
Oct 07 | పూర్వం ‘పులోమ’ అనే అతిలోక సౌందర్యవతి వుండేది. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన ‘పులోముడు’ అనే దైత్యుడు.. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా అనుకున్న వెంటనే తన మనోరథాన్ని పులోమ తండ్రికి తెలిపాడు.... Read more
Sep 22 | మహాభారతంలో కీలకపాత్రుడైన కర్ణుడు.. ఆనాడు దాకకర్ణుడనని ప్రసిద్ధి. తనకు తోచించి ఇతరులకు దానం చేయడంలో ఇతను దిట్ట. బంగారమైనా, మరేమైనా సరే.. దానం చేయడంలో కర్ణుడిని మించినవాడు ఎవడూ లేడు. పైగా.. కృష్ణుడు సైతం... Read more