శరన్నవరాత్రులలో మూడొవ రోజు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది. గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపఈ రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.
అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింపబడుతుంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది.
నవరాత్రులలో ఈ రోజు నారింజ రంగు(ఆరెంజ్) దుస్తులు ధరించి, అమ్మవారిని ఉపాసన చేసి, అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః
ర్యుక్తామిందు నిబద్దరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హస్తైర్వహం తీం భజే
శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీ గాయత్రై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం పరబ్రహ్మస్వరూపిణే నమః
పరమార్ధప్రదాయై నమః
ఓం జప్యాయై నమః
ఓం బ్రహ్మతేజో నమః
ఓం బ్రహ్మస్త్రరూపిణ్యై నమః
ఓం భవ్యాయై నమః
ఓం త్రికాలధ్యేయరూపిణ్యై నమః
ఓం త్రిమూర్తిరూపాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం వేదమాతాయై నమః
ఓం మనోన్మవ్యై నమః
ఓం బాలికాయై / వృద్దాయై నమః
సూర్యమండలవసిన్యై నమః
ఓం మందేహదానవధ్వంసకారిణ్యై నమః
ఓం సర్వకారణాయై నమః
ఓం హంసరూఢాయై నమః
ఓం వృషారూఢాయై నమః
ఓం గరుడారోహిణ్యై నమః
ఓం శుభాయై / షట్కుక్షిణ్యై నమః
ఓం త్రిపదాయై / శుద్దాయై నమః
ఓం పంచశీర్షాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం త్రివేదరూపాయై నమః
ఓం త్రివిధాయై నమః
ఓం త్రివర్గఫలదాయిన్యై నమః
ఓం దశహస్తాయై నమః
ఓం చంద్రవర్ణాయై నమః
ఓం విశ్వామిత్రవరప్రదాయై నమః
ఓం దశాయుధధరాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం సంతుష్టాయై నమః
ఓం బ్రహ్మపూజితాయై నమః
ఓం ఆదిశక్తై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం సుషుమ్నాభాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం చతుర్వింశత్యక్షరాఢ్యాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సత్యవత్సలాయై నమః
ఓం సంధ్యాయై / రాత్ర్యై నమః
ఓం సంధ్యారాత్రి ప్రభాతఖాయై నమః
ఓం సంఖ్యాయనకులోద్బవాయై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం సర్వవిద్యాయై నమః
ఓం సర్వమంత్రాద్యై నమః
ఓం అవ్యయాయై నమః
ఓం శుద్దవస్త్రాయై నమః
ఓం శుద్దవిద్యాయై నమః
ఓం శుక్లమాల్యానులేపనాయై నమః
ఓం సురసింధుసమాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం బ్రహ్మలోకనివాసిన్యై నమః
ఓం ప్రణవప్రతిపాద్యర్భాయై నమః
ఓం ప్రణతోద్దరణక్షమాయై నమః
ఓం జలాంజలిసుసంతుష్టాయై నమః
ఓం జలగర్భాయై నమః
ఓం జలప్రియాయై నమః
ఓం స్వాహాయై / స్వధాయై నమః
ఓం సుధాసంస్థాయై నమః
ఓం శ్రౌషడ్వౌషటడ్వషట్క్రియాయై నమః
ఓం సురభ్యై నమః
ఓం షోడశకలాయై నమః
ఓం మునిబృందనిషేవితాయై నమః
ఓం యజ్ఞప్రియాయ నమః
ఓం యజ్ఞమూర్త్యై నమః
ఓం స్రుక్ స్రువాజ్యస్వరూపిణ్యై నమః
ఓం అక్షమాలాధరయై నమః
ఓం అక్షమాలాసంస్థాయై నమః
ఓం అక్షరాకృత్యై నమః
ఓం మధుచ్చందదఋషిప్రీతాయై నమః
ఓం స్వచ్చందాయై నమః
ఓం చందసాంనిద్యై నమః
ఓం అంగుళీపర్వసంస్థాయై నమః
ఓం చతుర్వింశతిముద్రికాయై నమః
ఓం బ్రహ్మమూర్త్యై నమః
ఓం రుద్రశిఖాయై నమః
ఓం సహస్రపరమాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం విష్ణుహృదయాయై నమః
ఓం అగ్నిముఖాయై నమః
ఓం శతమాధ్యాయై నమః
ఓం శతవరాయై నమః
ఓం సహస్రదళపద్మస్థాయై నమః
ఓం హంసరూపాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం చరాచరస్థాయై నమః
ఓం చతురాయై నమః
ఓం సూర్యకోటిసమప్రభాయై నమః
ఓం పంచవర్ణముఖీయై నమః
ఓం ధాత్రీయై నమః
ఓం చంద్రకోటిశుచిస్మితాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం విచిత్రాంగ్యై నమః
ఓం మాయాబీజనివాసిన్యై నమః
ఓం సర్వయంత్రాత్మికాయై నమః
ఓం జగద్దితాయై / రాత్ర్యై నమః
ఓం మర్యాదాపాలికాయై నమః
ఓం మాన్యాయై నమః
ఓం మహామంత్రఫలప్రదాయై నమః
ఓం సర్వతంత్రస్వరూపాయై నమః
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more