దసరా నవరాత్రులలో అమ్మవారు నాలుగవ రోజు(ఆశ్వయుజ శుద్ధ తదియ) అన్నపూర్ణాదేవిగా దర్శనము ఇస్తుంది. అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం. ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిమ్చి, గంధపు పసుపు రంగు చీర, తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి.దధ్యన్నము, కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పించాలి. " హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.
అన్నపూర్ణ దేవి :
అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది. అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ తల్లిగా కుటుంబంలో మహిళకు ఉండే పాత్రను చాటిచెప్పే అవతారం.. అన్నపూర్ణ.. ఆకలితో ఉన్న వారెవరికైనా అన్నం పెట్టి ఆదరించమనే సందేశము…అమ్మవారు మనకు ఇస్తుంది. కుటుంబంలో తల్లిపాత్రకు…ఉన్న ప్రాథాన్యాన్ని…ఈ అవతారము మనకు బోదపడేలా చేస్తుంది.అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమే ఇస్తుంది. ‘భిక్షాం దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.
సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద్ధిపరచుము, దీనిని వ్రతముగా పాటించాలి. అంటే, ఆహార ధాన్యాల్ని ప్రజలకందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషిచేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలుపంచుకోవాలి. భూమియే- అన్నము. ఆకాశము అన్నాదము, అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతోంది. ఆకాశము భూమిపైగల జలమును సూర్యరశ్మి ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది. భూమియందు ఆకాశము ఆకాశమునందు భూమి ప్రతిష్ఠితమవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు, అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడై, అన్నము, పుత్రపౌత్రాభివృద్ధి పశు సంపద బ్రహ్మవర్చస్సు కలిగి కీర్తిమంతుడవుతాడు.
అన్నం ఎలా పుడుతుందనే విషయాన్నికూడా వేదం వివరించింది. పరబ్రహ్మతత్త్వమునుండియే ఆకాశము ఉద్భవించింది. ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు) ఓషధులనుండి అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా పరబ్రహ్మతత్త్వము. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి. అన్నపూర్ణాదేవి.
దీనులకు అన్నము ఉదకము దానము చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది మహాభారతము.ప్రకృతి స్వరూపం- ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన పుష్టివంతులగా నొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.
‘‘బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి. ‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే’. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.
అన్నపూర్ణ స్తోత్రం
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాభఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలస ద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థ గోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
దృశ్యాదృశ్యవిభూతిపావనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
ఆదిక్షాంతసమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రిణయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నాలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
చంద్రార్కానలకోటికోటిసదృశా చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వర శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి,
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవ శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్
ఇతిః శ్రీ అన్నపూర్ణాష్టకం సంపూర్ణమ్
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more