పుష్కర కాలం తరువాత లోక కల్యాణ దేవత అయిన కాత్యాయని దేవి అలంకా రంలో దుర్గమ్మను భక్తులు కొలిచేందుకు అవకాశం లభించింది. అక్టోబరు 5న(ఆశ్వయుజ శుద్ధ చవితినాడు) కాత్యాయని దేవిగా దుర్గమ్మను అలంకరిస్తారు. ప్రత్యేకంగా ఆరు రకాల నివేద నలు కూడా సమర్పిస్తారు. కాత్యాయని వ్రతం కూడా అదే రోజున నిర్విహిస్తారు. లోకం సుభిక్షంగా ఉండేందుకు వ్రతం చేస్తారు. కాత్యాయనీదేవికి వింధ్యాచలమే నివాసం. గాయత్రీ అవతారంగా ఈ తల్లిని కొందరు భావిస్తారు. అమోఘ ఫలదాయనిగా అమ్మకు పేరు. చతుర్భుజాలతో అలరారే ఈ మాతకు వాహనం సింహం. అమ్మను ఆరాధించడం వల్ల దుఃఖాలు తొలగిపోతాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా పొందుటకు గోపికలు కాత్యాయనీ వ్రతం ఆచరించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే అమ్మాయిలు వివాహ అనుకూలత కోసం భక్తులు కాత్యాయనీ వ్రతం ఆచరిస్తుంటారు.
నీలంరంగు చీర, నైవేద్యంగా కొబ్బరి అన్నం సమర్పించాలి.
కాత్యాయని దేవి చరిత్ర:
ఈమెకు కాత్యాయని అన్న పేరు ఏర్పడడానికి ఒక పురాణ కథ ఉంది. పూర్వకాలంలో ప్రఖ్యాతి చెందిన కతడనే మహర్షికి, కాత్యుడు పుత్రుడు. ఇతడు అమ్మ కోసం అనేక సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేసి అమ్మను ప్రత్యక్షం చేసుకుని తన పుత్రికగా జన్మించమని అమ్మను కోరుతాడు. కాత్యుడు తపస్సుకు మెచ్చి పరమేశ్వరి అతడి అభీష్టాన్ని తీరుస్తాను అంటూ అభయం ఇస్తుంది. ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాలకు భూలోకం అంతా మహిషాసురుని అత్యాచారాలతో తల్లడిల్లి పోతూ ఉంటుంది. దీనితో మహా శక్తి వంతుడైన మహిషాసురుని అంతం చేయడానికి బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు తమ తేజోంశాలతో మహిషాసురుని మట్టుపెట్టడానికి ఒక శక్తిని సృష్టించి ఆ శక్తినే కాత్యుడుకు కుమార్తెగా జన్మింపచేయడం జరుగుతుంది.
ఆశ్వయుజ కృష్ణ శుక్లచతుర్ధశినాడు కాత్యాయని గా జన్మించిన ఈమె దేవీ నవరాత్రులలో అతి శక్తి వంతమైన సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజలు పూజలు అందుకుని కాత్యాయని దేవి శక్తిమాత గా మారి దశమినాడు మహిషాసురుని సంహరిస్తుంది. చతుర్భుజాలతో స్వర్ణమయంగా మెరిసే అమ్మ రూపంలో అద్వితీయమైన ఆకర్షణశక్తి ఉంటుంది. ఈమె ఎడమ చేతిలో ఖడ్గం ఆ పై చేతిలో పద్మమూ ఉంటాయి.
కాత్యాయని
శ్లో ॥ చంద్రహొసోజ్జ్వలకరా శార్దులా వరవాహనా
కాత్యాయనీ శుభం దద్యా ద్దేవి దానవఘతిని ॥
శ్రీ దుర్గా దేవి అవతారాలలో అరోవరూపం 'కాత్యాయని' . 'కత' నామకుడైన మహర్షి కుమారుడు కాత్య మహర్షి . ఈ మహర్షి పేరునే కాత్య గోత్రము ప్రసిద్ది చెందినది . ఆ కాత్యగోత్రజుడైన కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని , అందువల్ల ఈమే కాత్యాయనిగా పేరుగాంచిందని ఒక ప్రతీతి .
ఒకానొక సమయంలో మహిషాసురుడనే రాక్షసుడు బలగర్వంతో వరగర్వంతో ముల్లోకాలను బాధిస్తుండగా వానిదుండాగాలకు వేసారినట్టి దేవతలు మునులు అందరు కలిసి వానిదుశ్చర్యలను బ్రహ్మదేవునికి విన్నవించగా బ్రహ్మ వారందరినీ వెంటబెట్టుకొని హరిహరులున్న చోటకు వచ్చి శరణువేడి ప్రార్థించాడు . అప్పుడు హరిహరులు ముఖప్రదేశాలనుంచి కోటి సుర్యకాంతులతో గొప్ప తేజస్సు వెలువడింది . దేవతలంత తమతమ దివ్యశక్తులను ఆ తేజస్సు నందు ఆవహింపజేశారు . ఆ మహాతేజస్సు స్త్రీ ఆకృతిపొంది మహాశక్తిగా అవతారం చెందింది .
ఆ మహాశక్తి మొదట కాత్యాయన మహర్షిచేత పూజలందుకొని సప్తమి , అష్టమి , నవమి దినాలలో ఆ మహర్షి ఇంట నిలిచి దశమినాడు లోకకంటకుడైన మహిషాసురుని సంహరించింది . కాత్యాయన మహర్షి ఇంట వేలసినందుకు ఈమె కాత్యాయనిగా ప్రసిద్ది పొందింది .
కాత్యాయని రూపం దేదీప్యమానం . ఈమె దేహకాంతి బంగారు ఛాయతో తళతళలాడుతుంటుంది . ఈమె చతుర్భుజి . నాలుగు చేతులు కలిగి ఉంటుంది. ఇరుచేతులయందు వరదాభయ ముద్రలు కలిగి ,ఇరు చేతులలో ఒకచేత ఖడ్గం ,ఒకచేత పద్మం ధరించి శోభిల్లు తుంటుంది .
శ్లోకం: చంద్రహాసోజ్జ్వల కరా శార్దూల వర వాహనా కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవ ఘాతిని...
కాత్యాయనీ వ్రతం అమోఘఫలదాయకం . కోరిన వరుని భర్తగా పొందటానికి అవివహితులైన నవయువతులు ఈ కాత్యాయని మాతను పూజించి వ్రతాన్ని చేయడం పురాణకాలం నుంచి వస్తున్న సంప్రదాయం .
శ్రీ కృష్ణ భగవానుని భర్తగా పొందటానికి వ్రేపల్లిలోని గోపికలందరు కలిసి కాత్యాయని వ్రతం చేసినట్లు భాగవతంలో చెప్పబడినది . ఉషఃకాలంలో యమునానదిని చేరుకున్న గోపికలు నది ఒడ్డున సైకత ప్రతిమను చేసి కాత్యాయని దేవిగా భావించుకొని
"కాత్యాయని మహామాయే మహాయోగి న్యధీశ్వరీ
నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమ !
కం ॥ ఓ కాత్యాయని భగవతి
నీకున్ మ్రొక్కెదము మేము నెడనుకంపన్
మాకిందఱకున్ వైళామ
శ్రీకృష్ణుడు మగడుగాగ జేయుము తల్లీ !"
అనే మంత్రంతో పూజలు చేసినట్లు చెప్పుకుంటారు. పరిపూర్ణ విశ్వాసంతో ఉపాసించిన వారికి ఈ మాత సులభంగా ప్రసన్నమౌతుంది . ఈ దేవిని పుజించేవారికి రోగభయంగాని , శత్రుభయంగాని , సంతాపంగాని ఉండదు . సమస్త విధాలుగా ఈ తల్లీని శరణుజొచ్చిన వారికి కోటి జన్మాల పాపాలను కూడా నశింపజేస్తుంది. ఈరూపంలో అమ్మను దర్శించుకుని సమస్త శుభాలు పొందండి.
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more