టైటిల్ ఫేవరెట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌కు భారత్ తన ఆటతీరుతో బలమైన హెచ్చరిక పంపింది. క్వాలిఫయింగ్ టోర్నీలో టైటిల్ గెలిచిన వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి మిహ ళల ప్రపంచకప్‌లో బోణీ చేసింది. గ్రూప్ ఎ లో భాగంగా గురువారం బ్రబౌర్న్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 105 పరుగుల తేడాతో గెలిచింది.టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 284 పరుగుల భారీస్కోరు సాధించింది. ఓపెనర్ తిరుష్ కామిని (146 బంతుల్లో 100; 11 ఫోర్లు, 1 సిక్సర్) కెరీర్లో తొలి సెంచరీ సాధించింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ (94 బంతుల్లో 72; 7 ఫోర్లు) అర్ధసెంచరీ చేసింది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జులన్ గోస్వామి (21 బంతుల్లో 36; 6 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) స్లాగ్ ఓవర్లలో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో భారత్ భారీస్కోరు సాధించింది.
వెస్టిండీస్ బౌలర్లలో డాటిన్‌కు మూడు వికెట్లు దక్కాయి.వెస్టిండీస్ జట్టు 44.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటయింది. డాటిన్ (16 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) కొద్దిసేపు భారత శిబిరంలో ఆందోళన పెంచింది.డేలీ (38 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించింది. వీరిద్దరూ మినహా బ్యాట్స్‌విమెన్ అందరూ విఫలమయ్యారు. భారత బౌలర్లలో నిరంజన మూడు వికెట్లు తీసుకోగా... జులన్ గోస్వామి, గౌహర్ సుల్తానా రెండేసి వికెట్లు పడగొట్టారు. సెంచరీతో రాణించిన కామినికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more