మహిళల ప్రపంచకప్ లో అద్బుతాలు ఆవిష్ర్కుతం అవుతున్నాయి. ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ శ్రీలంక మధ్యన జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. ఎప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళను ఓడించని శ్రీలంక వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో గెలిచి షాక్ ఇచ్చారు. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఆఖరి బంతికి ఓడించారు. శుక్రవారం బ్రబౌర్న్ స్టేడియంలో చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన గ్రూప్ ఎ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో నెగ్గి శ్రీలంక ఊపిరి పీల్చుకుంది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా... ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 238 పరుగులు మాత్రమే చేసింది. గున్ (71 బంతుల్లో 52; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. బ్రిండెల్ (31), నైట్ (38), జోన్స్ (41) రాణించారు. కౌసల్య, సిరివర్ధనే, సెనెవిరత్న రెండేసి వికెట్లు తీసుకున్నారు.
శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసి గెలిచింది. జయాంగని (72 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్సర్)తో పాటు యశోద మెండిస్ (46), సిరివర్ధనే (34) రాణించడంతో ఓ దశలో లంక లక్ష్యం దిశగా సాగింది. కానీ ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకుని వరుస విరామాల్లో వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు బిగించారు. కౌసల్య (41 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక ఎండ్‌లో నిలకడగా ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రంట్, ఎల్విస్, బ్రిండెల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. సంచలన ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరచిన శ్రీలంక క్రికెటర్ కౌసల్యకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more